English   

 నాగ్ ఓటీటీ మూవీ చేయనున్నారా

 nagarjuna
2021-07-17 15:34:59

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓటీటీ మూవీ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు.. అలాగే న్యూ కంటెంట్ ను అందించేందుకు ఓటీటీ సంస్థను ప్రారంభించనున్నారని కూడా ఈమధ్య జోరుగా వార్తలు వచ్చాయి. అయితే.. నాగ్ ఓటీటీ సంస్థను స్టార్ట్ చేస్తారో లేదో క్లారిటీ లేదు కానీ.. ఓటీటీ మూవీ పై క్లారిటీ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగ్ ఓటీటీ మూవీ చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ఇటీవల ఓ కథ విన్నారట. ఆ కథ నాగ్ కి బాగా నచ్చేసిందట. వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పారని సమాచారం.

ఇది ఓటీటీ కోసం చేస్తున్న సినిమా. నాగ్ ఓటీటీ మూవీ చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే.. వైల్డ్ డాగ్ మూవీని థియేటర్లో రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో మెప్పించలేదు. ఆతర్వాత వైల్డ్ డాగ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తే.. బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పుడే నాగ్ ఓటీటీ కోసం మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో నాగార్జున ఓటీటీ కోసం చేస్తున్న మూవీ కథ ఏంటి..? ఎవరు డైరెక్ట్ చేయనున్నారు.? అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయం గురించి నాగార్జునను అడిగితే.. ప్రస్తుతం ఇంకా డెవలప్ చేసే స్టేజ్ లోనే ఉంది. ఆ స్టోరీలో నటించాలనుకుంటున్నాను. అంతా అనుకుంటున్నట్టు అది ఓటీటీ సినిమానే. ఈ వేదిక నాకు చాలా కొత్త. అందుకే కాస్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.

నాగార్జున ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈతరం హీరోల్లో నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. అందుకనే నాగార్జునను ప్రయోగాల సర్థార్ అంటారు. ఇప్పుడు నాగ్ ఓటీటీ మూవీ చేయడం కూడా ఓ ప్రయోగమే. మరి.. ఈ ఓటీటీ ప్రయోగంలో కూడా నాగార్జున సక్సస్ అవుతారని ఆశిద్దాం.

More Related Stories