English   

సీరియస్ అయిన నాగ్...తమన్నా చేత జర్నలిస్టులకి సారీ !

Tamanna Simhadri
2019-08-11 13:01:43

బిగ్‌బాస్ సీజన్3 లో నిన్నటి రోజు చాలా వాడివేడిగా సాగింది. ఎప్పుడూ లేని విధంగా నాగార్జున నిన్న ఈవారం మొత్తం ఇంట్లో తప్పు చేసిన ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా క్లాస్ పీకారు. ముఖ్యంగా వితికా, రాహుల్‌, తమన్నా, అలీరెజాలను భీబత్సంగా వేసుకున్న నాగ్‌ ఎపిసోడ్ అంతా సీరియస్ గా సాగుతుందని భావించి ఎవరెవరికి పడదో వారందరికీ ఇద్దరేసి చొప్పున టాస్క్స్ ఇచ్చి ఆర్డినేషన్‌ గేమ్‌ ఆట ఆడించాడు. అలాగే తమన్నా చేతా, సింగర్ రాహుల్ చేత జర్నలిస్టులకీ, యాంకర్ లకీ క్షమాపణలు చెప్పించాడు నాగ్. అసలు ఏమైందంటే ఈవారంలోని ఒక ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండర్ తమన్నా జర్నలిజం ఓ నటన, డబ్బు తీసుకుని నటిస్తారని అంది. ఆమె మాటలకు జర్నలిజంతో ఎదిగిన శివజ్యోతి ఫైర్ అయింది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఊరుకోనని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అయినా తమన్నా తన మాటను వెనకకు తీసుకోకుండా జర్నలిస్టులు నటిస్తారని నొక్కి వక్కానించింది. అలా జర్నలిస్టులను ఎలా టార్గెట్ చేస్తావని నాగార్జున తమన్నాను గట్టిగానే నిలదీశారు. అయితే దానికి వెంటనే ఒప్పుకోకుండా తాను అలా అనలేదని అనడంతో నాగ్ మళ్ళీ సీరియస్ అయ్యాడు. హౌస్‌లో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్‌ను చూపించడంతో తమన్నా సైలెంట్ అయిపోయింది. అలా అవ్వడమే కాక ఆమె తల దించుకుని నవ్వుతూ ఉంటుంది, అది చూసి తమన్నాపై నాగార్జున మండిపడ్డాడు. అప్పుడేమో జర్నలిజం ఒక యాక్టింగ్ అనడమే కాక ఇప్పుడు ముసుముసిగా నవ్వుతున్నావంటూ ఫైర్ అయ్యాడు. దీంతో స్పందించిన తమన్నా.. తాను నవ్వడం లేదని, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో శివజ్యోతి సహా జర్నలిస్టులందరికీ తమన్నాతో నాగ్ క్షమాపణలు చెప్పించాడు. తర్వాత అలీ రెజా కూడా అనవసరంగా హిమజ మీద అరిచాడని అతని మీద కూడా ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ శ్రీముఖిని ఫాల్తుది, అలాగే యాంకర్స్ గురించి చేసిన కామెంట్స్ గుర్తు చేసి మళ్ళీ సారీ చెప్పించాడు.  

More Related Stories