English   

నాగార్జునను కూడా మోసం చేసినట్టేనా..?

nagarjuna upset with officer
2018-06-01 22:16:33

కొన్నేళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ అనే టివిషోలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను కరణ్ ఓ ప్రశ్న అడిగాడు. ‘రామ్ గోపాల్ వర్మ ఈజ్....’ అంటూ ఖాళీ ఇచ్చి పూరించమన్నాడు. అయితే వర్మ శిష్యుడే అయిన అనురాగ్.. సింపుల్ గా ‘రామ్ గోపాల్ వర్మ వాజ్’అంటూ పూరించాడు. అంటే వర్మ అని ఒకడుండేవాడు అన్నట్టుగా. ఇంకా చెబితే మనం అనుకున్న టాలెంటెడ్ వర్మ ఎప్పుడో పోయాడు. ఇప్పటి వర్మకు అంత సీన్ లేదని చెప్పాడు. అప్పుడు మన మీడియా అనురాగ్ పై కామెంట్స్ చేసింది. కానీ ఆ తర్వాత వర్మ ప్రయాణం చూస్తే అతను ఎంత ఖచ్చితంగా ఊహించాడో అర్థం చేసుకోవచ్చు. 

డిజాస్టర్స్ నుంచి అతి భారీ డిజాస్టర్స్ కు అడ్రెస్ లా మారిపోయాడు వర్మ. అయినా నాగార్జున నమ్మాడు అంటే ఏదో ఉందిలే అనుకున్నారు. కానీ ఆఫీసర్ రిపోర్ట్ చేసిన తర్వాత కానీ తెలియలేదు. వర్మ మారలేదు. నాగార్జున మోసపోయాడని. నిజానికి నాగ్ ఇచ్చిన అవకాశం వర్మకు చాలా పెద్దది. తనకు బ్రేక్ ఇచ్చాడనో లేక.. తన కెరీర్ మొత్తం చెప్పుకునే సినిమా ఇచ్చాడనో నమ్మకంతోనే మళ్లీ వర్మకు ఛాన్స్ ఇచ్చి ఉండవచ్చు. కానీ వర్మ ఏ మాత్రం ఉపయోగించుకోలేదు. అదేమంటే ఫిలాసఫీ చెబుతాడు కానీ.. నిజంగా ఇలాంటి సినిమాను వర్మ, నాగ్ కాంబినేషన్ లో ఊహించగలమా చెప్పండి. ఏమాత్రం ఆకట్టుకోని కథ,కథనాలతో ఆద్యంతం కెమెరా యాంగిల్స్ తో టార్చర్ పెట్టేశాడు వర్మ. తను టెక్నికల్ గా బ్రిలియంట్ అని ఎంటైర్ కంట్రీ ఒప్పుకుంటుంది. కానీ కథ ఉంటేనే కదా టెక్నికల్ వాల్యూస్ యాడ్ అయ్యేది. అది లేకుండా ఎన్ని యాంగిల్స్ మారిస్తే ఏం ఉపయోగం. పాపం పోలీస్ అనగానే ఫిట్ గా తయారైన నాగార్జునను రామ్ గోపాల్ వర్మ ఫుల్ గా మోసం చేశాడు. ఆఫీసర్ వర్మకు మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది అనడంలో ఏ డౌటూ లేదు..  

More Related Stories