English   

నాగార్జున ముందు సీక్వెలా ? ప్రీక్వెలా ?

Nagarjuna
2019-03-15 06:24:47

బంగార్రాజు పేరు వినగానే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గుర్తుకురాక మానదు. నాలుగేళ్ల క్రితం కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వసి వాడి తస్సాదియ్యా అంటూ బంగార్రాజు పాత్రలో నాగ్‌ పల్లెటూరి సోగ్గాడిగా నటించి హిట్ కొట్టాడు. సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాకు ప్లాన్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ. ఈ విషయం మీద చాన్నాళ క్రితం నుండే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్తెరకెక్కించే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు తెలుస్తుంది. క‌ళ్యాణ్ కృష్ణ సీక్వెల్ స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ ట‌చెస్ ఇస్తుండ‌గా, జూన్ నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నారట నాగ్. ఇక ఈ సినిమాకి బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.నాగ్ స‌ర‌స‌న హీరో యిన్ గా ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. అయితే ఈ సినిమా చైతూ కూడా చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు చెబుతున్నారు. గత సినిమాలో తండ్రీ కొడుకులుగా నాగార్జునే కనిపించగా ఇప్పుడు బంగార్రాజు మ‌న‌వ‌డి పాత్ర‌లో నాగ చైత‌న్య క‌నిపించ‌నున్నాడ‌ట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేన‌ర్‌ మీద ఈ సినిమాని నాగార్జున నిర్మించనున్నాడు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఇప్పటికే నాగ్ మ‌న్మ‌థుడు 2 అదే మన్మధుడు సీక్వెల్ లో న‌టించేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. అయితే ముందు ప్రీక్వెల్ తెరకేక్కుతుందా ? లేక సీక్వెల్ తెరకేక్కుతుందా ? అనేది వేచి చూడాల్సి ఉంది.

More Related Stories