English   

ఆయనకిద్దరు రీమేక్ లో నాగశౌర్య

nagashourya
2018-07-26 21:11:19

ఆయనకిద్దరు.. జగపతిబాబు హీరోగా పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన సినిమా. హిలేరియస్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న సినిమా ఇది. ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఆయనకిద్దరు బాక్సాఫీస్ వద్దా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికి జగపతిబాబుకు ఉన్న ఇద్దరు హీరోయిన్ల హీరో ట్యాగ్ ను కంటిన్యూ చేస్తూ వచ్చిన సినిమా అది. అయితే ఇప్పుడా సినిమాను నాగశౌర్య రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. అంతే కాదు.. ఇదే కథను నేటి జనరేషన్ కు అనుగుణంగా మార్చి రాజా అనే దర్శకుడు శౌర్యను ఒప్పించాడట కూడా. అన్నట్టు గతంలో నాగశౌర్య భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి కదా.. అది ఈ సినిమాయే అంటున్నారు. 

మరి ఆయనకిద్దరు రీమేక్ లో నాగశౌర్య ఎలా ఉంటాడనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నేటి జెనరేషన్ కు అనుగుణంగా మార్చిన బౌండ్ స్క్రిప్ట్ తో సదరు దర్శకుడు సిద్ధంగా ఉన్నాట్ట. ఈ యేడాది ఆఖరులో షూటింగ్ మొదలుపెట్టేయొచ్చు అంటున్నారు. మరోవైపు నాగశౌర్య తన సొంత బ్యానర్ లో రూపొందించిన @నర్తనశాల సినిమాతో బిజీగా ఉన్నాడిప్పుడు. ఈ సినిమాను ఆగస్ట్ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన బ్యానర్ లో సినిమాలైతే ఒకలా, బయటి బ్యానర్ లో సినిమాలైతే ఒకలా ప్రవర్తించే నాగశౌర్య నిజంగా ఆయనకిద్దరు సినిమా చేస్తాడా అనేదే ఇప్పుడు అసలు డౌట్.

More Related Stories