English   

నాగశౌర్య.. అంత స్వార్థమా..? 

nagashourya
2018-07-19 22:26:22

తనదైతే ఒకలా.. పరాయిదైతే మరోలా.. ఇలా ఉంది యంగ్ హీరో నాగశౌర్య పరిస్థితి. నిజం.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోన్న ఈ యంగ్ స్టర్ పర్సనల్ గా అంత అందగాడు కాదనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. అంటే మనోడికి అంతః సౌందర్యం లేదు.. వ్యక్తిగా చాలా స్వార్థపరుడు అంటున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. తను సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేసి ఛలోతో ఫస్ట్ టైమ్ పెద్ద హిట్(మరి ఊహలుగుసగుసలాడే పరిస్థితి ఏంటో చెప్పడు)కొట్టాను అనుకుంటున్నాడు. అంతకు ముందే చేసిన కణం సినిమా చేశాడు. కానీ సినిమా టైమ్ లో తన పాత్ర తక్కువగా ఉందని ప్రమోషన్స్ కు వెళ్లలేదు. అదేమంటే సాయి పల్లవి యాటిట్యూడ్ చూపిస్తోందని మనోడు చూపించాడు యాటిట్యూడ్.. ఇక అమ్మమ్మగారిల్లు విషయంలోనూ అంతే.. ఆ సినిమాకు కాస్త బానే ఉందనే టాక్ వచ్చింది. కానీ తన పాత్ర కంటే ఇతరుల పాత్రలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని అలకబూనాడు. దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ కూ హ్యాండిచ్చాడు. నిజానికి ఇతను కాస్త ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండి ఉంటే అమ్మమ్మగారిల్లు కాస్తైనా రేంజ్ పెరిగేదే.. కానీ ఇప్పుడు తన బ్యానర్ కోసం మాత్రం తెగ కష్టపడుతున్నాడు. 

నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్. తల్లితండ్రి అండగా ఆ బ్యానర్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నర్తనశాల చేస్తున్నాడు. ఈ సినిమాకు బడ్జెట్ ఎనిమిది నుంచి పది కోట్లు అంటున్నారు.  అయితే కేవలం ప్రమోషన్స్ కే మూడు కోట్ల వరకూ కేటాయించాలనుకుంటున్నారట. యస్.. ప్రమోషన్స్ తో ఎక్కువగా అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఓ సినిమాకు ప్రమోషన్ ఎంత కీలకమో అతనికి తెలుసు.. తెలిసి కూడా ఇతరుల సినిమాల ప్రమోషన్స్ ను పట్టించుకోలేదు. తమవైతే డబ్బులు.. వేరేవారివైతే పేపర్లా..? అంటూ గుసగుసలు పోతున్నారు సినిమా జనం.. ఏదేమైనా ఈ వయసులో ఇంత స్వార్థంగా ఆలోచించే యంగ్ స్టర్ బహుశా టాలీవుడ్ లోనే ఉంటాడేమో.. 

More Related Stories