English   

నాగార్జున ఎక్క‌డ తంతాడో ఇప్పుడు..?

Nagrajuna fire on RGV
2018-06-02 10:17:41

ఆఫీస‌ర్ క‌థ చెప్ప‌డానికి ముందు క‌థ‌తో పాటు త‌న‌కు వ‌ర్మ ఓ లెట‌ర్ రాసాడ‌ని ప్రీ రిలీజ్ వేడుక‌లో చెప్పాడు నాగార్జున‌. అందులో త‌ను చెప్పింది చెప్పిన‌ట్లు తీయ‌క‌పోయినా.. ఏదైనా సినిమా తేడా జ‌రిగినా కూడా త‌న‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌న్న‌మ‌ని చెప్పాడ‌ని చెప్పాడు నాగ్. అయితే వ‌ర్మ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వ‌డ‌ని.. చాలా అద్భుతంగా తీసాడ‌ని పొగిడాడు నాగార్జున‌. కానీ అలా పొగిడి మూడు రోజులు కూడా కాలేదు ఇప్పుడు సినిమా విడుద‌లైంది. ఎప్ప‌ట్లాగే టాక్ తేడాగానే వ‌చ్చింది. వ‌ర్మ సినిమా అంటే ఓపెనింగ్స్ రాక‌పోయినా క‌నీసం నాగార్జున సినిమాకు అయినా ఓపెనింగ్స్ ఉండాలి క‌దా.. కానీ ఆఫీస‌ర్ కు అవి కూడా క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం కూడా వ‌ర్మే. ఈయ‌న‌పై న‌మ్మ‌కం లేక ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్స్ కు రాలేదు. పైగా వ‌ర్మే చెప్తాడు క‌దా నా సినిమాను ఎవ‌డు చూడ‌మ‌న్నాడు అంటూ..? ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా ఇదే చేస్తున్నారు. దానికితోడు నాగార్జున కూడా ప్రెస్ మీట్ లో బాలేని సినిమాను ఎంత ప్ర‌మోట్ చేసినా ప్రేక్ష‌కులు చూడ‌రంటూ చెప్పాడు. ఇప్పుడు ఇదే నిజ‌మైంది. మ‌రి నాగ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆయ‌న కెరీర్ ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలిక‌..!

More Related Stories