English   

ర‌జినీ స్థానంలోకి వ‌చ్చిన నాగార్జున‌..

nagrajuna in dhanush direction
2018-05-31 11:03:12

అవును.. ఇది న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం. ఇమేజ్ తో ర‌జినీతో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఇప్పుడు ర‌జినీ స్థానంలోకి మాత్రం నాగార్జున వ‌చ్చేస్తున్నాడు. అది కూడా అల్లుడు ధ‌నుష్ కార‌ణంతోనే. పైగా నాగార్జున కూడా ఇప్పుడు ఒక్క ఇండ‌స్ట్రీతో స‌రిపెట్టు కోవ‌డం ఎందుకు.. అన్ని ఇండ‌స్ట్రీలు మ‌న‌వే క‌దా అంటున్నాడు. ఈయ‌న‌ చూపులు ఇప్పుడు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌పై కూడా ఉన్నాయి. పైగా ఈయ‌న తెలుగులో ఇప్పుడు సాధించాల్సింది ఏమీ లేదు. ఇక్క‌డా అంతా చూసే ప‌క్క ఇండ‌స్ట్రీల వైపు అడుగేస్తున్నాడు మ‌న్మ‌థుడు. ఇత‌ర ఇండ‌స్ట్రీల్లోనూ ఇమేజ్ సాధించాల‌ని చూస్తున్నాడు నాగార్జున‌. ఆ మ‌ధ్య మ‌ళ‌యాల సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు నాగ్. అందులో మోహ‌న్ లాల్ హీరో గా న‌టిస్తున్నాడు. ఈ విష‌యంపై మ‌రోసారి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు కూడా. 

ఇక ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి నాగార్జున‌కు పిలుపు వ‌చ్చింది. అది కూడా ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో. అవును.. నాగార్జునే ఈ విష‌యం క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ధ‌నుష్ చెప్పిన క‌థ న‌చ్చింద‌ని.. అందులో న‌టిస్తాన‌ని చెప్పాడు ఈ హీరో. ర‌జినీకాంత్ కోసం ఈ క‌థ సిద్ధం చేసినా ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో ఆ పాత్ర‌లో త‌న‌ను ఊహించుకుంటున్నాడు ధ‌నుష్ అని చెప్పాడు నాగార్జున‌. ఇదివ‌ర‌కే ప‌వ‌ర్ పాండితో ద‌ర్శ‌కుడు అయ్యాడు ధ‌నుష్. అది బాగానే ఆడింది. ఇక రెండో సినిమాను తేండ్రాల్ మూవీస్ లో చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే వీళ్ల సంస్థ నుంచి వ‌చ్చిన మెర్స‌ల్ సంచ‌ల‌నం సృష్టించింది. ఇలాంటి సంస్థ‌లో సినిమా చేయ‌బోతున్నాడు ధ‌నుష్. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున న‌టించే అవ‌కాశం ఉంది. ఇందులో ధ‌నుష్ కూడా న‌టించే అవ‌కాశాలు లేక‌పోలేదు. మొత్తానికి అలా ర‌జినీ చేయాల్సిన సినిమాను తాను అందుకున్నాడు నాగార్జున‌. 

More Related Stories