English   

ఏదైనా ఆశించొచ్చా ఆఫీస‌ర్..?

Nagrajuna Officer expectaion

ఒక‌ప్పుడు వ‌ర్మ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే ఆస‌క్తిగా చూసేవాళ్లు ప్రేక్ష‌కులు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయిన‌యి. క‌నీసం థియేట‌ర్స్ లోంచి మ‌ధ్య‌లోనే వ‌చ్చే సినిమాలు ఇవ్వ‌క‌పోతే చాలు.. అంత‌కంటే ఇంకేం వ‌ద్దంటున్నారు. కానీ వ‌ర్మ అవి కూడా ఇవ్వ‌ట్లేదు. ఆడియ‌న్స్ మీద అంత క‌క్ష ఏంటో తెలియ‌దు కానీ ఈయ‌న నుంచి క‌నీసం చెప్పుకునే సినిమా వ‌చ్చి చాలా ఏళ్లైపోయింది. వ‌ర్మ నుంచి ఇప్పుడు అద్భుతాలు ఆశించ‌డం అత్యాశే. కానీ ఆయ‌న మ‌న‌సు పెడితే క‌చ్చితంగా అద్భుతం కాక‌పోయినా ఆక‌ట్టుకునే సినిమా అయితే వ‌స్తుంది. కానీ ఆయ‌న మ‌న‌సు మాత్రం మ‌రో చోట ఉంటుంది. అందుకే చిత్ర విచిత్ర‌మైన సినిమాల‌న్నీ వ‌స్తుంటాయి. అయితే ఇప్పుడు నాగార్జున కోస‌మే ఈయ‌న కాస్త మ‌న‌సు ద‌గ్గ‌ర పెట్టుకున్న‌ట్లు అనిపిస్తుంది. ఆఫీస‌ర్ టీజ‌ర్స్ చూస్తుంటే అదే పాత స్టైల్ క‌నిపిస్తుంది. 

వ‌ర్మ అయితే మార‌లేద‌నే విష‌యం క్లియ‌ర్ గా అర్థ‌మైపోతుంది. కానీ గ‌త సినిమాల‌తో పోలిస్తే మాత్రం క‌చ్చితంగా బెట‌ర్ ఔట్ పుట్ ఇచ్చాడు. ట్రైల‌ర్ లో కొత్త‌గా ఏం చూపించ‌లేదు వ‌ర్మ‌. అదే తుపాకి.. అదే గోల‌.. కాక‌పోతే కూతురు సెంటిమెంట్ మాత్రం చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే అది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది చూడాలిక‌..! ఈ చిత్రం జూన్ 1 విడుద‌ల కానుంది. హాలీవుడ్ సినిమా టేకెన్ నుంచి ఈ చిత్రాన్ని స్పూర్థి పొందార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిగా కాక‌పోవ‌డంతో నైజాంలో తానే విడుద‌ల చేస్తున్నాడు వ‌ర్మ‌. మ‌రి చూడాలిక‌.. ఈ ఆఫీస‌ర్ నాగార్జున న‌మ్మ‌కాన్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..?

More Related Stories