English   

మహేష్ మీసం పై...నమ్రత ఆసక్తికర పోస్ట్

Namrata
2020-10-29 11:32:58

టాలీవుడ్ లో ఎక్కువ యాడ్స్ లో నటించే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. తమ్సప్ లాంటి పెద్ద బ్రాండ్ కి మహేష్ బాబు అంబాసిడర్ గా ఉన్నారు. అంతే కాకుండా పలు ఇతర యాడ్స్ లో సైతం మహేష్ బాబు నటించారు. ఇక ఇటీవల ఆయన ఫ్లిప్ కర్ట్ కోసం ఒక యాడ్ షూట్ లో నటించారు. అయితే ఈ యాడ్ లో మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కోర మీసాలతో పంచకట్టులో కనిపించాడు. తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రత ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "కృత్రిమంగా అమార్చేవి ఎప్పుడూ వాస్తవికంగా కనిపించవు. వాటితో షూట్ చేయాల్సివచ్చినప్పుడు. కచ్చితంగా సౌకర్యవంతంగా లేదా సరదాగా ఉండదు. అయితే తమవైపు నిపుణులు ఉన్నప్పుడు సవాళ్లను ఇష్టపడని వారెవరు" అంటూ నమ్రత తన పోస్ట్ లో పేర్కొన్నారు. మహేష్ షూట్ కోసం మేకప్ వేసుకుంటున్న స్సందర్భంలో ఆ ఫోటోను తీసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సూపర్ స్టార్ "సర్కారు వారి పాట" సీనిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగం వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమాలో మహేష్ బాబు లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

More Related Stories