45 ఏళ్ల బాలయ్య నట ప్రస్థానం...అది కూడా రికార్డే

నందమూరి నట సింహం బాలయ్య 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అదేంటి ఆయనకి అరవై పైబడ్డాయి కదా ఇప్పుడు ఆయనకు 45 ఏళ్లు ఏమిటా అనుకుంటున్నారా ? ఆయన ఆ 45 ఏళ్లు పూర్తి చేసుకున్నది నటుడిగా. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా తాతమ్మకల. ఈ సినిమా నేటితో నలభై ఐదేళ్ళు పూర్తి చేసుకొంది.
1974 ఆగస్ట్ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో హీరోకి ఐదుగురు సంతానం. ఆయన పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, పిల్లలు పలు అగచాట్లు పడతారు. అతని ఐదుగురు పిల్లల్లో చివరివాడు తప్ప మిగిలిన అందరూ చెల్లాచెదురవుతారు. చివరకు పల్లెలోనే కష్టపడి పనిచేసుకుంటే బాగుంటుందనే నమ్మకంతో స్వగ్రామం చేరతాడు. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండటం, కుటుంబనియంత్రణ తప్పనిసరి అనే విధానం అమలులో ఉండేది. అందుకే ఎన్టీఆర్ దాన్ని వ్యతికరేకిస్తూ ఈ చిత్రం నిర్మించారు.
ఈ సినిమా ద్వారానే బాలకృష్ణ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆయన ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నాన్నలాగే ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలనని ఎన్నో సినిమాల ద్వారా నిరూపించారు. కథ పౌరాణికమైనా... జానపదమైనా... సాంఘికమైనా... ఆయా పాత్రలలో ఒదిగిపోయే నటుడు ఎవరంటే ఒక్క బాలకృష్ణ మాత్రమే అని చెప్పగలం. తాతమ్మకల సినిమాతో నటజీవితం ప్రారంభించిన బాలకృష్ణ ఓ అరుదైన రికార్డ్‌ను నమోదు చేశారు. అదేంటంటే బాలకృష్ణ 1974 నుంచి 2019 వరకూ గ్యాప్ లేకుండా నటిస్తూనే ఉండటం విశేషం.
ఈ నలభై ఐదు ఏళ్లలో ఒక్క ఏడాది కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటిస్తూనే ఉన్నారు. అయితే 1981, 2013 సంవత్సరాల్లో మాత్రమే ఆయన సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆ ఏడాదిలలో విడుదల కాలేదు. ఏది ఏమైనా నటవారసుల్లో నలభై ఏళ్లు ఏకధాటిగా కెరీర్‌ను కొనసాగించిన ఘనత మనదేశంలో బాలకృష్ణకే దక్కింది. అటు బాలీవుడ్ లో కానీ మరే వుడ్ లో కానీ నలభై ఐదేళ్ళ ఏళ్ల కెరీర్లో ఏకధాటిగా నటిస్తూ అప్పుడు కూడా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసిన ఘనత ఒక్క బాలకృష్ణకే దక్కడం గమనార్హం.
ఇక ఇప్పుడు ఆయన రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేగా సేవల్ని అందిస్తు మరోవైపు బసవతారకం హాస్పిటల్ చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే బాలకృష్ణ 104వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఇంకెందుకు ఆలస్యం బాలయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్పెడ్డామా ?