English   

సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ మీద ఇంటరెస్ట్ చూపిస్తున్న కళ్యాణ్ రామ్

kalyanram
2019-07-17 19:35:46

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జక్కన్న రూపొందించిన యమదొంగ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫాంటసీ జానర్ లో రెగ్యులర్ లవ్ స్టోరీకి లింక్ చేస్తూ జక్కన్న తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆయన బ్రదర్ కళ్యాణ్ రామ్ కూడా ఇలాంటి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ చేస్తున్నాడని అంటున్నారు. వేణు మల్లిడి దర్శకత్వంలో ఆయన ఒప్పుకున్నా సినిమా అదే జోనర్ లో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాకి తుగ్లక్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా కూడా చెబుతున్నారు. అధికారిక ప్రకటనలు అయితే రాలేదు కానీ ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకేక్కనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా అంతా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్, కేథరిన్ పేర్లు వినిపిస్తున్నాయి. దీని మీద మరింత క్లారిటీ రావలసి ఉంది.

More Related Stories