English   

శ్యామ్ సింగ రాయ్ గా మారుతున్న నాని

nani
2020-02-24 19:56:03

అనుకున్నట్టుగానే నాని సినిమా ప్రకటన వెలువడింది. ముందు నుండీ ప్రచారం జరిగినట్టే నాని కొత్త సినిమా ఈరోజు ప్రకటించారు. నాచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి సూపర్ హిట్ సినిమాని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి 'నాని' హీరోగా మరో సినిమా నిర్మిస్తున్నారు. 'టాక్సీ వాలా' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'శ్యామ్ సింగ రాయ్' అనే పేరును నిర్ణయించినట్లు 'నాని' పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది సినిమా యూనిట్. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. హీరో 'నాని'కి ఇది 27వ సినిమా.

More Related Stories