English   

బ్యాగ్రౌండ్ లేక‌పోవ‌డం వ‌రం అంటోన్న నాని.. 

Nani-awe
2018-02-15 12:37:05

ఇండ‌స్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే ఏదైనా చేయొచ్చు.. వాళ్ల‌ను నిల‌బడేవర‌కు నిల‌బెడుతూనే ఉంటారంటారు. వార‌సులుగా రావ‌డం అదృష్టం అంటారంతా. కానీ నాని మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. అస‌లు వార‌స‌త్వం లేక‌పోవ‌డ‌మే మంచిదంటున్నాడు ఈ కుర్ర హీరో. వార‌స‌త్వ లేక‌పోతే ఇండ‌స్ట్రీలోకి రావ‌డం.. ఇక్క‌డ ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌డం క‌ష్టం అవుతుంది కానీ ఒక్క‌సారి నిల‌బ‌డితే అంతా ఒక్క‌టే అంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. వార‌సుల‌కు త‌మ‌కు ఒక్క‌టే తేడా అన్నాడు నాని. వార‌సుల‌కు మొదలుపెట్టడం సుల‌భం.. త‌మ‌కైతే కష్టమంటున్నాడు నాని. దానికితోడు త‌మ సినిమాలు వ‌చ్చేట‌ప్పుడు ఎలాంటి అంచ‌నాలు ఉండవు.. కాబ‌ట్టి ఈజీగానే తాము న‌చ్చేస్తుంటామ‌ని.. ఒక్కసారి ప్రేక్షకులకు నచ్చితే నిలబడిపోవటం కూడా త‌మ‌కే ఈజీ అంటున్నాడు ఈ హీరో. అదే వార‌సుల‌కు అయితే అంచ‌నాలు త‌ల‌పైనే ఉంటాయ‌ని.. వాటిని నిల‌బెట్టుకోడానికి వాళ్లు ప‌డే క‌ష్టం మ‌రో స్థాయిలో ఉంటుందంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. బ్యాగ్రౌండ్ లేకుండా వ‌స్తే క‌ష్టాలు ఉంటాయి.. కానీ బ్యాగ్రౌండ్ ఉండి వ‌స్తే బాధ్య‌త‌లు ఎక్కువ‌గా ఉంటాయంటున్నాడు ఈ హీరో. నాని నిర్మించిన అ..! సినిమా ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా స‌ర‌దాగా ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇలా సమాధానం ఇచ్చాడు నాని. 

More Related Stories