English   

నాని ‘యాక్షన్’ ఫలించిందా..?

nani
2018-03-02 16:23:19

నేచురల్ స్టార్ గా తిరుగులేని వేగంతో దూసుకుపోతోన్న స్టార్ నాని. అతని స్పీడ్ అందుకోవడం ఏ యంగ్ హీరోకూ సాధ్యం కావడం లేదు. కానీ ఈ మధ్య నాని మారాడు. ఇకపై నేచురల్ స్టోరీస్ కాకుండా కాస్త మసాలా కథలు కావాలంటున్నాడు. తన రేంజ్ ఇప్పటికే 25-30కోట్ల వరకూ పెరిగింది కాబట్టి.. ఇంకా ఈ సాఫ్ట్ కథలేందీ.. ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కావాలంటున్నాడు. కాకపోతే కథాబలం తప్పనిసరి అంటున్నాడనుకోండి. మరి రేంజ్ పెరగాలంట పెద్ద దర్శకులతోనే పనిచేయాలి కదా. ఆ విషయమే ఆలోచిస్తున్నాడు నాని. నిజమే.. మార్కెట్ పెరగాలంటే తనతో పాటు మరింత మార్కెట్ ఉన్న దర్శకుడైతేనే సాధ్యం. ఆ మేరకు నాని చేస్తోన్న ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి స్టార్ హీరో కోరుకుంటోన్న దర్శకుడే అతనితో సినిమా చేయాలనుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని నటించిన కృష్ణార్జున యుద్ధం పూర్తయింది. నాగార్జునతో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నాడు. దీని తర్వాత ఒప్పుకున్న సినిమాల్లో సాఫ్ట్ నెస్ మరీ ఎక్కువైందని వద్దన్నాడు. నాని యాక్షన్ హీరో ఇమేజ్ కోసం కోరుకుంటున్నాడనే మాట ఇప్పటికే ఇండస్ట్రీలో పాకిపోయింది. అతని యాక్షన్ డ్రీమ్ ఫలించిందో ఏమో.. ఇప్పుడు ఓ సూపర్ ఫామ్ లో ఉన్న స్టారెస్ట్ డైరెక్టర్ నానితో సినిమా చేస్తే ఎట్టా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట.

మరి నానితో సినిమా చేయాలనుకుంటోన్న దర్శకుడెవురో తెలుసా.. కొరటాల శివ.. షాక్ అయ్యారా.. కానీ టాలీవుడ్ లో వినిపిస్తోన్న హాట్ న్యూస్ లో ఇదొకటి. వరస చూస్తే ఈ కాంబినేషన్ నిజంగా వర్కవుట్ అయ్యేలా కూడా ఉంది. నాని చేతిలో ఇప్పుడున్న సినిమా నాగార్జునతో కలిసి చేస్తోన్న సినిమానే. ఇటు కొరటాల కూడా మహేష్ బాబు తర్వాత ఎవరితో చేస్తున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. అంటే ఆయన చేయాలనుకుంటోన్న హీరోలు ఉన్నారు. కానీ వాళ్లంతా బిజీగా ఉన్నారు. ఒక దశలో ఎన్టీఆర్ తో కొరటాల అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఏకంగా రెండు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. వచ్చే యేడాదే ఇది సాధ్యం. ఇటు రామ్ చరణ్ కూడా బోయపాటి, రాజమౌళితో కమిట్ అయ్యాడు. ఇక ప్రభాస్ తో ఇప్పట్లో సాధ్యం కాదు. అల్లు అర్జున్ తో అని వినిపించింది కానీ.. ఇది కూడా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ఇవన్నీ కాదు కానీ.. అసలు కొరటాల శివే నానితో సినిమా చేయాలనుకుంటున్నాడంటున్నారు. ఇప్పటి వరకూ చేసిన నాలుగూ పెద్ద హీరోలతోనే. దానికి కాస్త బ్రేక్ ఇచ్చి మీడియం రేంజ్ హీరోతో చేస్తే ఖచ్చితంగా తన స్టామినా ఏంటో తెలుస్తుంది. అంటే కొరటాల రేంజ్ చిన్న హీరోతో చేస్తే క్లియర్ గా తేలిపోతుంది. ఈ కారణంగానే నాని, కొరటాల శివ కాంబినేషన్ కు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories