English   

బిగ్ బాస్ -2లో నాని నిరాశపరుస్తున్నాడా..?

nani

బిగ్ బాస్.. తెలుగు నాట సరికొత్త సంచలనంగా వచ్చిన రియాలిటి షో. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి పవర్ ప్యాక్డ్ స్టార్ తో హోస్టింగ్ చేయించి ఫస్ట్ పార్ట్ లో విపరీతమైన హైప్ తీసుకురావాలనుకున్నారు. కానీ అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు లేనప్పుడు అనే బారికేడ్స్ తీస్తే రేటింగ్స్ లో చాలా తేడాలున్నాయనేది నిజం. ఎన్టీఆర్ ఉన్న రెండు రోజుల్లో రేటింగ్ అమాంతం పెరగడం తర్వాత అంతే వేగంగా తగ్గడం చూశాం. ఇప్పుడు రెండో సీజన్ కు నాని హోస్ట్ గా ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ ను చూసిన కళ్లతో నానిని చూడ్డం ఇబ్బందిగా ఉందనేది చాలామంది అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇద్దరి రెమ్యూనరేషన్స్ లో కూడా తేడాలున్నాయనుకోండి. అయితే ఎన్టీఆర్ హోస్ట్ చేసినంత జోష్ గా నాని చేయలేకపోతున్నాడనే విమర్శ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఉంది. 

తర్వాత రెండు మూడు ఎపిసోడ్స్ లో ఫర్వాలేదనిపించినా.. మొత్తంగా నాని అంత గొప్ప ప్రభావం చూపించలేకపోతున్నాడనేవారే ఎక్కువ. కంటెంస్టెంట్స్ ఏం చెబితే అది కామ్ గా వినడం.. వారిని మందలించే క్రమంలో డోస్ లేకపోవడం.. పైగా ఆల్రెడీ కొన్ని విషయాలు బయటకు లీక్ అవుతుండటం.. మొత్తంగా బిగ్ బాస్-2ను ఆడియన్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా చేశాయి. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేషన్స్ చాలా విమర్శలకు తావిచ్చాయి. అఫ్ కోర్స్ వాటికి నానికి సంబంధం లేకపోయినా.. షో లీడర్ గా నాని తన రేంజ్ లో కూడా షో చూపించలేకపోతున్నాడు అనేది మెజారిటీ వ్యూవర్స్ అభిప్రాయం. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముందే లీక్ అవుతుండటం నాని కంటే బిగ్ బాస్ షోకే పెద్ద ఇబ్బంది. ఇప్పటికి సగం ఎపిసోడ్స్ కూడా కాకుండానే సగానికి పైగా ఆడియన్స్ తగ్గిపోయారు. ఇక ఇలా ముందే లీక్స్ వచ్చేస్తే.. ఈ రియాలిటీ షోకు సాధారణ సీరియల్స్ కు వచ్చే రేటింగ్ కూడా రాదు అనేది నిజం. 
 

More Related Stories