English   

నాని కిడ్నాపులు చేస్తున్నాడా..?

natural star nani

నాని ఏంటి కిడ్నాపులు చేయ‌డం ఏంటి.. అర్థం లేకుండా అనుకుంటున్నారా..? అవును.. ఇదే నిజం అనిపిస్తుంది ఇప్పుడు. అయితే నిజంగా మాత్రం కాదు.. సినిమా కోస‌మే అంతా. ఈయ‌న ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఎప్రిల్ 12న సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు నాని. ఒక‌టి తిరుప‌తిలో ఉండే పాత్ర అయితే.. మ‌రొక‌టి ఇట‌లీలో ఉండే పాత్ర‌. ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే చిలిపి తగాదాలే కృష్ణార్జున యుద్ధం. అయితే ఈ చిత్రంలో ఓ సోష‌ల్ మెసేజ్ ను కూడా ఇస్తున్నాడు గాంధీ. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్.. కిడ్నాపింగ్ గురించి కీల‌క‌మైన విష‌యాలు చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీదే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

ముఖ్యంగా అమ్మాయిల గురించి క‌థ న‌డుస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క‌థ‌లో ఈ పాయింట్ న‌చ్చే మ‌రో మాట లేకుండా నాని కూడా గాంధీకి ఓకే చెప్పాడ‌ని తెలుస్తుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎంసిఏతో 40 కోట్ల మార్క్ అందుకున్న నాని.. ఈ చిత్రంతో ఇంకొంచెం మార్కెట్ పెంచుకోవాల‌ని చూస్తున్నాడు. పైగా మేర్ల‌పాక గాంధీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేదు. ఈయ‌న చేసిన వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా సూప‌ర్ హిట్ అయ్యాయి. మ‌రోవైపు నాని కూడా వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తైపోయిన‌ట్లే..! చూడాలిక‌.. నాని కిడ్నాపింగ్ డ్రామా ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories