English   

శ్రీ రెడ్డి వెనక  నాని ఉన్నాడా..?

Sri-Reddy

శ్రీ రెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోన్న ప్రధాన సమస్యకు కేంద్ర బిందువు. ఆమె నుంచి మొదలైన రచ్చ టాలీవుడ్ ను కొన్ని రోజుల పాటు షేక్ చేసింది. అది కాస్తా మీడియాకూ చుట్టుకుని.. ఏకంగా పరిశ్రమలో ఎన్నో మార్పులకూ కారణమైంది. దీని వల్ల నిన్నటి వరకూ శ్రీ రెడ్డి అంటే ఎవరనేది ఇండస్ట్రీలోనే చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టివి ఛానల్స్  చూసే ప్రతి ఒక్కరికీ శ్రీ రెడ్డి అంటే బాగా తెలిసిపోయింది. తనకు కావాల్సినంత క్రేజ్ కూడా వచ్చేసింది. కాకపోత అది కొత్త సినిమాలు రావడానికి పని చేయదనేది అందరికీ తెలుసు. అయితే కొన్ని రోజులుగా కామ్ గా ఉన్న(ఉండాల్సి వచ్చిందంటే కరెక్టేమో) శ్రీ రెడ్డి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తనను ఇన్నాళ్లుగా అబ్యూజ్ చేస్తున్న వారిపై కేసులు పెట్టబోతున్నానంటూ బాంబ్ వేసింది. తనతో పాటు ఓ సీనియర్ లాయర్ ను కూడా తెచ్చుకుంది. ఏకంగా సుప్రీమ్ కోర్ట్ వరకూ వెళతానంటూ ప్రెస్ మీట్లో కేకలు పెట్టింది. మరి ఈ గొడవ ఎంత దూరం వెళుతుందో కానీ.. ఇప్పుడు మరో కొత్త వార్త వినిపిస్తోంది. దీని వెనక నాని ఉండొచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఈ మధ్య శ్రీ రెడ్డికి బిగ్ బాస్ సీజన్ 2లో చాన్స్ వస్తుందనుకున్నారు చాలామంది. శ్రీ రెడ్డి కూడా ఎక్స్ పెక్ట్ చేసింది. నిజానికి బిగ్ బాస్ కు కూడా ఇలాంటి కాంట్రవర్శీయల్ పీపులే కావాలి. అందుకే శ్రీ రెడ్డి సీజన్ 2లో ఎంటర్ అవడం ఖాయం అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా శ్రీ రెడ్డికి బిగ్ బాస్ నో చెప్పింది. అందుకు కారణం.. ఈ సీజన్ లో నాని హోస్ట్ గా ఉండటమే అంటున్నారు. మొదట్లో శ్రీ రెడ్డి నాని పైనా ఇన్ డైరెక్ట్ గా కొన్ని కమెంట్స్ చేసింది. ఇప్పటి వరకూ నాని వాటిపై స్పందించలేదు కానీ.. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వద్దని ఉంటాడు అనుకుంటున్నారు. కాకపోతే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరనే విషయం హోస్ట్ కు తెలియదు. కానీ వార్తలు వస్తున్నాయి కదా.. అందుకే వార్తల విషయంలోనే వాస్తవం బయటకు రాకుండా చేసి ఉండొచ్చు అంటున్నారు. మరి శ్రీ రెడ్డిని బిగ్ బాస్ సీజన్ 2లోకి ఎంటర్ కాకుండా నాని చేస్తాడనుకోలేం కానీ... నాని సెంటర్ గా కొన్ని వార్తలు రావడం మాత్రం సహజమే కదా.. 

More Related Stories