English   

నాని  షాకింగ్ డెసిషన్ 

Nani-Devadas
2018-08-23 04:58:12

మొన్నటి వరకూ నేచురల్ స్టార్ గా.. వరుస విజయాలతో దూసుకుపోయిన నాని ఒక్కసారిగా డల్ అయ్యాడు. అలాగని అతనికేమీ భయంకరమైన ఫ్లాప్స్ పడలేదు. కానీ తనదైతే డబుల్ హ్యాట్రిక్ అని చెప్పుకున్నాడో.. అవన్నీ దాదాపు ఒకే మూసలో సాగిన సినిమాలు. దీంతో ఎమ్.సి.ఏ టైమ్ లోనే హెచ్చరించిన ఆడియన్స్ కృష్ణార్జున యుద్ధంకు భారీ షాక్ ఇచ్చారు. మినిమం కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేకపోయిందీ సినిమా. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నాగార్జునతో కలిసి దేవదాస్ లో నటిస్తున్నాడు నాని. అయితే గత కొంతకాలంగా నాని విపరీతంగా భయపడిపోతున్నాడట. తను చేస్తోన్న సినిమాల విషయంలో అతనికి ఒకరకమైన ఫ్లాప్ ఫోబియా పట్టుకుందంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

నిజానికి నానికి ఫ్లాపులు కొత్తేమీ కాదు.. కానీ డబుల్ హ్యాట్రిక్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ను కూడా ఒక్క ఫ్లాప్ కే కోల్పోయాడంటే అతనెంత భయస్తుడో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. నాని గత కొన్ని రోజుల క్రితం ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వలో ‘జెర్సీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. 1980స్ లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా చెప్పారీ సినిమాను. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అలాగే దిల్ రాజు నిర్మాణంలో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘‘సభకి నమస్కారం’’ అనే సినిమా కూడా ప్రకటించారు. వీటితో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమా వార్తలు కూడా వచ్చాయి.

బట్ ఇప్పుడీ సినిమాలనూ హోల్డ్ లో పెట్టాడు నాని. కారణం.. అవి ఫ్లాప్ అవుతాయోమో అనే భయంతో పాటు.. కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు వైవిధ్యమైన కథలు ఇస్తోంటే.. తను మాత్రం తన ఇమేజ్ కు తగ్గట్టుగానే కథలు సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఫీలవుతున్నాడట. దీంతో ఇప్పుడు దేవదాస్ షూటింగ్ పూర్తియ్యాకే కొత్త సినిమా గురించి ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఒక రకంగా నాని తను వేస్తోన్న ప్రతి అడుగుకూ భయపడుతున్నాడంటున్నారు దగ్గర నుంచి చూస్తున్నవాళ్లు. అసలే కొన్నాళ్ల క్రితం శ్రీ రెడ్డి గొడవ వల్ల పర్సనల్ గా ఇబ్బందిపడ్డ నానికి ఇప్పుడు సినిమాలు కూడా పోవడం మరింత డిప్రెషన్ కు గురి చేస్తోందట. అందుకే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను కూడా హోల్డ్ లో పెట్టి ఇంకేదైనా చేయాలా అనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయినా ఇండస్ట్రీలో హిట్లూ ఫ్లాపులు కామన్.. ఎవరో ముందుకు వెళుతున్నారనీ.. ఇంకెవరో ఫ్లాపులు ఇచ్చారనీ ఇలా ప్రతిదానికీ భయపడితే ఎట్టా నానీ.. 

More Related Stories