English   

నానిని భ‌యపెడుతున్న ఎన్టీఆర్..

Nani-Jr NTR
2018-05-19 13:23:12

ఒక‌ర్ని చూసిన పాత్ర‌లో మ‌రొక‌ర్ని చూడడం అంటే చిన్న విష‌యం కాదు. ప్రేక్ష‌కులు అక్క‌డ అలవాటు ప‌డిన త‌ర్వాత పాత వాళ్ల‌ను మ‌రిపించ‌డం అంత తేలిక కాదు. అలా చేయ‌బోయి నాగార్జున ప్లేస్ లో వ‌చ్చిన చిరంజీవి అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. ఆయ‌నే వ‌చ్చినా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో ఏమైందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ గా నాని వ‌స్తున్నాడు. ఇది ఆల్రెడీ ఎన్టీఆర్ కు ఫిక్స్. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఎప్పుడూ అలాగే ఉంటది.. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ను మ‌రిపించాలంటే నాని ఇంకా ఏదో కొత్త‌గా చేయాలి.. చేస్తున్నాడు ఇప్పుడు విడుద‌లైన ప్రోమోలో త‌న స్టైల్ చూపించి ప‌డ‌గొట్టాడు న్యాచుర‌ల్ స్టార్. బాబాయ్ ఈసారి ఇంకాస్త మ‌సాలా అంటూ రెచ్చిపోయాడు. అంటే షో ఎలా ఉండ‌బోతుందో కూడా అర్థ‌మ‌వుతుంది. తొలి సీజ‌న్ మాదిరి ఈ సారి 70 రోజులు కాదు.. ఏకంగా 100 రోజులు ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందుకే నాని కూడా 4.5 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు. ప్రోమో వ‌ర‌కు అయితే నాని స్టైల్ ప‌క్కాగా క‌నిపించింది. మ‌రి రేపు షోలో కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోతాడేమో చూడాలిక‌..!

More Related Stories