English   

నాని వల్ల హర్ట్ అయిన దర్శకుడు

Nani-Vikram-Kumar

నాని గురించి ఈ మధ్య అన్నీ తేడా వార్తలే వస్తున్నాయి. ఆ మధ్య ఓ ఎఫైర్ గురించిన న్యూస్ విన్నాం. రీసెంట్ గా యాక్షన్ ఇమేజ్ కోరుకుంటున్నాడనే వార్తలూ హల్చల్ చేశాయి. ఈ రెండు వార్తలను నాని స్ట్రాంగ్ గా ఖండించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తోన్న విషయం ఈ రెండో దానికి లింక్ అయి ఉంది. దాని వల్ల ఓ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బాగా హర్ట్ అయ్యాడని టాక్. నాని చేసిన నిర్వాకం వల్ల అతను ఏకంగా టాలీవుడ్ నే వదిలి వెళ్లాలనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. మరి నాని వల్ల హర్ట్ అయిన ఆ దర్శకుడెవరో తెలుసా.. విక్రమ్ కుమార్. యస్. ఇష్క్, మనం, 24 ఫేమ్ విక్రమ్ కుమారే. అసలు ఈ ఇద్దరి మధ్య తేడా ఎక్కడ వచ్చింది.. 

రీసెంట్ గా విక్రమ్ కుమార్ అక్కినేని అఖిల్ తో హలో అనే సినిమా చేశాడు. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత నానితో సినిమా అన్న వార్తలు వినిపించాయి. చాలామంది ఇవి రూమర్స్ అనుకున్నారు. కానీ నిజమేనట. నాని కూడా విక్రమ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్. నాని వంటి టాలెంటెడ్ తో సినిమా కాబట్టి విక్రమ్ ను తర్వాత కొందరు హీరోలు అప్రోచ్ అయినా.. ఆల్రెడీ నాని ఓకే చేశాడు కదాని వారందరికీ నో చెప్పాడు.  ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత విక్రమ్ తో సినిమా చేయాలి. ఏమైందో కానీ ఇప్పుడు నాని విక్రమ్ ను హోల్డ్ లో పెట్టేశాడు. అందుకు కారణం నాని నిజంగానో ఓ పెద్ద దర్శకుడితో సినిమా చేయాలనుకోవడమే అంటున్నారు. ఆ దర్శకుడు కొరటాల శివ ఆ మధ్య వినిపించింది. అది నిజమా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ నాని తనను హోల్డ్ పెట్టడం.. తనతో సినిమా విషయంలో పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో విక్రమ్ కుమార్ బాగా హర్ట్ అయ్యాడట. అందుకే అతను ఏకంగా టాలీవుడ్ ను వదిలేద్దామనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.

 నిజానికి విక్రమ్ మొదటి సినిమా బాలీవుడ్ లోనే చేశాడు. 13బి అనే ఆ హారర్ మూవీ తెలుగులోనూ డబ్ అయింది. ఇక తెలుగులో ఒక్కో ప్రాజెక్ట్ కు భారీ టైమ్ పడుతుండటంతో పాటు ఇప్పుడు నాని బిహేవియర్ కూడా ఈ దర్శకుడిని హర్ట్ చేసిందని.. ఆ కారణంగా బాలీవుడ్ కు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడనే వార్తలు టాలీవుడ్ ను ఊపేస్తున్నాయి.  

More Related Stories