English   

మహానటిలో నాని పాత్ర ఇదే

Nani-mahanati

మహానటి.. ఈ మధ్య కాలంలో ఎంటైర్ టాలీవుడ్ అటెన్షన్ ను డ్రా చేసిన సినిమా. అలనాటి మేటి మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తోన్నఈ మూవీ ముందు నుంచీ సంచలనాలే సృష్టిస్తోంది. టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. అశ్వనీదత్ కూతుళ్లు నిర్మిస్తున్నారు. సావిత్రి బయోపిక్ అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ లేకుండా అసాధ్యం. అందుకే ఆ రెండు పాత్రల్లో ఎవరు నటిస్తున్నారా అని ఎంటైర్ టాలీవుడ్ ఎదురు చూసింది. ఓ దశలో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ అతను నోచెప్పాడు. కానీ ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు నాగ చైతన్య ఓకే చెప్పాడు. షూటింగ్ కూడా పూర్తయింది.
 
ఇక సావిత్రి భర్తగా మళయాల యంగ్ స్టార్ దుల్కర్ సాల్మన్ నటించాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు నటించారు. ఇతర పాత్రల్లోనూ ప్రకాష్ రాజ్ వంటి బలమైన ఆర్టిస్టులే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ పాత్ర ఎవరు చేస్తున్నారన్న విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ అది నాని అని ఇవాళ ఫైనల్  చేసింది యూనిట్. దీంతో ఎంతోమంది ఆశ్చర్యపోయారు. నాటి ఎన్టీఆర్ గా నేటి నేచురల్ స్టార్ నటించాడా అని చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు. అసలు ఇన్నాళ్లూ ఈ విషయాన్ని భలే దాచారే అని కూడా అనుకుంటున్నారు. 

మొత్తంగా నాని ఈ పాత్ర చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇప్పుడు వరుస విజయాలతో ఉన్న నాని అంతకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇప్పుడీ సక్సెస్ లకు ఫస్ట్ హిట్ ఎవడే సుబ్రహ్మణ్యం. దాని దర్శకుడే మహానటి దర్శకుడు. అలాగే అప్పుడు నిర్మాతలైన అశ్వనీదత్ ఇప్పుడు నాని నెక్ట్స్ మూవీని నిర్మిస్తున్నాడు. యస్.. నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు అశ్వనీదత్తే కదా నిర్మాత. మొత్తంగా నాని ఎన్టీఆర్ లా నటించడానికిఈ లెక్కలన్న పనిచేశాయనుకోవచ్చు. మరి ఎన్టీఆర్ గా నాని, ఏఎన్నార్  చైతూ పాత్రలు సినిమాలో ఎంత సేపుంటాయి. వారు ఎలా మెప్పించారు అన్నది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఏదేమైనా నాని ఎంట్రీతో మహానటి రేంజ్ మరింత పెరుగుతుందనుకోవచ్చు.

More Related Stories