English   

ర‌వితేజను మ‌రిపిస్తున్న నాని.. 

Nani-RaviTeja

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ టైమ్ న‌డుస్తున్న‌పుడు ఎలాంటి అండ లేకుండా వ‌చ్చి 1983లో ఖైదీ సినిమాతో చ‌రిత్ర సృష్టించారు చిరంజీవి. ఎన్టీఆర్ లాంటి స్టార్ మ‌ళ్లీ రాడేమో అనుకుంటున్న టైమ్ లో నేనున్నాను అంటూ సొంతంగా వ‌చ్చి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. ఆయ‌న త‌ర్వాత సొంతంగా వ‌చ్చి స్టార్ హీరో అయ్యింది ర‌వితేజ మాత్ర‌మే. చిన్న‌చిన్న పాత్ర‌లు చేస్తూ వ‌చ్చి.. చివ‌రికి స్టార్ అయ్యాడు మాస్ రాజా. మాస్ ఆడియ‌న్స్ లో పిచ్చె క్కించే ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎంజాయ్ చేసాడు ర‌వితేజ‌. ఈ అద్భుతం జ‌రిగి కూడా ప‌దేళ్లు దాటిపోయింది. ర‌వితేజ త‌ర్వాత చాలా మంది హీరోలు వ‌చ్చారు. కానీ సొంతంగా వ‌చ్చి నిల‌బ‌డిన వాళ్లు మాత్రం త‌క్కువే. దాంతో ర‌వితేజ సేఫ్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈయ‌న స్థానంలోకి నాని వ‌స్తు న్నాడు. ర‌వితేజ‌ సినిమాలు హిట్టైతే 30 కోట్లు వ‌స్తాయి. కానీ నాని ఆ రేంజ్ దాటేసి ప‌రుగులు తీస్తున్నాడు. పైగా ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 8 వ‌ర‌స విజ‌యాలు మ‌నోడి ఖాతాలో ఉన్నాయి.  మొన్న‌ వ‌చ్చిన ఎంసిఏకు టాక్ యావ‌రేజ్ గా ఉన్నా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం 40 కోట్లు వ‌చ్చాయి. ర‌వితేజ సినిమాల్లో ఏది ఇప్ప‌టి వ‌ర‌కు 35 కోట్ల మార్క్ అందుకోలేదు. కానీ నాని మాత్రం దీన్ని చేసి చూపిస్తున్నాడు. గ‌తేడాది నేనులోక‌ల్ 35 కోట్లు.. నిన్నుకోరి 30 కోట్లు.. ఎంసిఏ 40 కోట్ల మార్క్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన కృష్ణార్జున యుద్ధం అయితే బిజినెస్ ప‌రంగానే 35 కోట్ల‌కు అమ్ముడైంది. ర‌వితేజ సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అంత బిజినెస్ చేసిన సినిమా ఒక్క‌టి కూడా లేదు. పైగా మొత్తం బిజినెస్ 47 కోట్లైంది. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఈ చిత్రం కానీ హిట్టైతే నాని రేంజ్ 50 కోట్ల‌కు చేర‌డం ఖాయం. మొత్తానికి ర‌వితేజ స్థానాన్ని అందు కోడానికి ఎవ‌రొస్తారా అనే ఎదురుచూపుల‌కు నాని స‌మాధానం చెప్పాడు. 

More Related Stories