English   

దొరికిపోయిన శ్రీ‌రామ్ ఆదిత్య‌.. దేవ‌దాస్ కాపీనా..? 

Nani-Devadas
2018-09-22 16:22:13

ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. స‌ర్వం స‌ర్వ‌మంగ‌ళ మేల‌మే అన్న‌ట్లుంది ఇప్పుడు ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి. ఏ ద‌ర్శ‌కున్ని న‌మ్మాలో.. ఎవ‌ర్ని న‌మ్మ‌కూడ‌దో కూడా అర్థం కావ‌డం లేదు ఇప్పుడు. అంద‌రూ కాపీ దారిలోనే వెళ్తుంటే.. ఎవ‌రు సొంతంగా ఆలోచిస్తున్నారో అంతు చిక్క‌డం లేదు. ఇప్పుడు దేవ‌దాస్ సినిమాపై కూడా కాపీ అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ సినిమాపై ముందు నుంచి ఏదో తెలియ‌ని ఆస‌క్తి ఉంది.. అలాగే అనుమానాలు కూడా ఉన్నాయి. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ క‌థ‌ను సొంతంగా రాసుకున్నాడా లేదంటే ఎక్క‌డ్నుంచైనా ఎత్తుకొచ్చాడా అనే చాలా రోజులుగా ఇన్వెస్టిగేష‌న్ చేస్తూనే ఉన్నారు నెటిజ‌న్లు. ఇప్పుడు దీనికి స‌మాధానం దొరికేసింది. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఈ చిత్రం హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అని తెలుస్తుంది. 

1999లో హాలీవుడ్ లో వ‌చ్చిన అన‌లైజ్ దిస్ అనే సినిమాకు ఇది ఫ్రీమేక్. ఇందులో కూడా ఓ మాఫియా డాన్.. సైక్రియార్టిస్ట్ మ‌ధ్య సాగే క‌థ. దేవ‌దాస్ లో కూడా ఇదే క‌థ ఉంది. ఇక్క‌డ మాఫియా డాన్ గా నాగార్జున న‌టిస్తుంటే.. అత‌డి డాక్ట‌ర్ పాత్ర‌లో నాని న‌టిస్తున్నాడు. డాన్.. డాక్ట‌ర్ ను ఎలా కాపాడాడు.. త‌న‌కు వ‌చ్చిన ముప్పు నుంచి ఎలా త‌ప్పించుకున్నాడు అనేది క‌థ‌. ఇప్పుడు దేవ‌దాస్ లో కూడా ఇదే క‌నిపిస్తుంది. ట్రైల‌ర్ లో కూడా నానిని నాగార్జున కాపాడుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. అన‌లైజ్ దిస్ సినిమాను ఉన్న‌దున్న‌ట్లు కాకుండా ఇక్కడి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లు అడాప్ట్ చేసుకున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రి ఇది నిజ‌మా.. దీనికి శ్రీ‌రామ్ ఆదిత్య నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌నేది చూడాలిక. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది దేవ‌దాస్. ఇందులో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టించారు. అశ్వినీద‌త్ నిర్మాత‌.

More Related Stories