English   

నాని-నాగ్.. అప్పుడే అయిపోయిందా..? 

Nani-Nag

ఏంటి అయిపోయేది.. ఇప్పుడే క‌దా మొద‌లైంది.. అప్పుడే అయిపోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు నిజంగానే ఇంతే ఫాస్ట్ గా అయింది షూటింగ్. మొన్న‌టికి మొన్న ఉగాది సంద‌ర్భంగా నాని-నాగ్ సినిమా తొలి షెడ్యూల్ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఇప్పుడు అది అయిపోయింది. అప్పుడే తొలి షెడ్యూల్ అయిపోయింది. ఇందులో కాస్త కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. మీసాలు మాత్ర‌మే ఉంచి.. గ‌డ్డం తీసేసాడు ఈ హీరో. ఇందులో నాగార్జున మాఫియా డాన్ గా.. నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇది ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అనే విష‌యం మాత్రం అర్థ‌మైపోతుంది. హైద‌రాబాద్ లోనే తొలి షెడ్యూల్ పూర్తి చేసాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది. త‌న‌కు నాని అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త‌న కామెడీ టైమింగ్ న‌చ్చుతుంద‌ని అందుకే క‌లిసి న‌టిస్తున్నాన‌ని చెప్పాడు నాగార్జున‌. ఈ చిత్రం కోసం తాను కూడా చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు నాగార్జున‌. నాని కూడా నాగార్జున‌తో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఆయ‌న న‌ట‌న త‌న‌కు న‌చ్చుతుంద‌ని చెప్పాడు న్యాచ‌ర‌ల్ స్టార్. ఇద్ద‌రూ ఒక‌ర్నికరు బాగానే పొగుడుకుంటున్నారు. ఈ మ‌ధ్యే శమంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలను ఒకేచోట క‌లిపిన‌ శ్రీ‌రామ్.. ఇప్పుడు నాగార్జున‌-నానిల‌ను క‌లిపేసాడు. మ‌రి చూడాలిక‌.. నాని, నాగార్జున సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?          

More Related Stories