English   

నాగార్జునను మింగేస్తున్న నాని..

Nani Nagarjuna
2018-06-11 08:27:31

ఒక్క ఫ్లాప్ వ‌చ్చినంత మాత్రానా నాని ఇమేజ్ త‌గ్గిపోయిందనో.. మార్కెట్ ప‌డిపోయింద‌నో అనుకోవ‌డం అవివేక‌మే. దానికి ముందు వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాలు ఉన్నాయి ఈ హీరోకు. ఆ ఎఫెక్ట్ అంత ఈజీగా త‌గ్గ‌దు. ఇది ఇప్పుడు లెక్క‌ల్లో కూడా క‌నిపిస్తుంది. నాని ఇప్పుడు శ్రీ‌రామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. ఇందులో నానితో పాటు నాగార్జున కూడా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాగార్జున 4 కోట్ల పారితోషికం తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాన‌టి త‌ర్వాత ఈయ‌న బ్యానర్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం నాని ఏకంగా 8 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే నాగార్జున కంటే డ‌బుల్ అన్న‌మాట‌. ఇప్పుడు ఈ చిత్రానికి ఇంత క్రేజ్ ఉంద‌న్నా.. మార్కెట్ భారీగా ఏర్ప‌డింద‌న్నా.. రేపు బిజినెస్ జ‌ర‌గాల‌న్నా కూడా నాగార్జున కంటే నానికే ఎక్కువ మార్కులు వేయ‌క త‌ప్ప‌దు. దాంతో ఆ మాత్రం పారితోషికం స‌రైందే అంటున్నారు కొంద‌రు. నాని సినిమాలు ఇప్పుడు ఈజీగా విడుద‌ల‌కు ముందే 40 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. కానీ నాగార్జున సినిమాలు 20ల్లోనే ఆగిపోతున్నాయి. దాంతో మార్కెట్ డ‌బుల్ ఉంది కాబ‌ట్టి రెమ్యున‌రేష‌న్ కూడా డ‌బుల్ తీసుకోవ‌డంలో త‌ప్పేం లేదుగా..! ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ తో నాగార్జున‌.. ర‌ష్మిక మంద‌న్నాతో నాని రొమాన్స్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 12న విడుద‌ల కానుంది ఈ చిత్రం. 

More Related Stories