English   

 నాని.. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరవాలేమో..?

Nani
2018-04-16 07:15:44

నాని అంటే ఇప్పుడు కేరాఫ్ హిట్ అంటున్నారు. కానీ ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం చూసిన త‌ర్వాత ఇది అన‌కూడ‌దేమో అనిపిస్తుంది. నాని వ‌ర‌స విజ‌యాల జోరుకు ఈ చిత్రం బ్రేక్ వేసేలాగే క‌నిపిస్తుంది. దానికి కార‌ణం రొటీన్ క‌థ‌. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఎనిమిది విజ‌యాలు వ‌ర‌స‌గా అందుకున్న హీరోకు ఎలాంటి క‌థ‌లు చేయాలో క్లారిటీ ఉండ‌దా..? ఈ విష‌యంలో నానికి ఆ క్లారిటీ కాస్త మిస్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. కాన్ఫిడెన్స్ కాస్తా ఇప్పుడు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఈయ‌న అందుకున్న విజ‌యాల్లో చాలా వ‌ర‌కు డిఫెరెంట్ క‌థ‌లే ఉన్నాయి. కానీ గ‌తేడాది నుంచి నాని రూట్ మారింది. నేనులోక‌ల్.. ఎంసిఏ లాంటి రొటీన్ క‌థ‌లు చేసాడు న్యాచుర‌ల్ స్టార్. కానీ అవి కూడా మ‌నోడికి బంప‌ర్ హిట్స్ ఇచ్చాయి. ఎంసిఏ అయితే ఏకంగా 40 కోట్ల మార్క్ అందుకుంది. అయితే ఈ చిత్రం విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా తీసుకొచ్చాయి. అయినా ప‌ట్టించు కోకుండా ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం కూడా ప‌క్కా మాస్ క‌థ అంటూ పాత క‌థ‌ను ప‌ట్టుకొచ్చాడు. ఈ సారి షాక్ త‌గిలేలా క‌నిపిస్తుంది. ఈ సినిమా సేఫ్ అవ్వ‌డం క‌ష్టంగా మారిందిప్పుడు. 30 కోట్లు ఏ కోణంలో వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. దాంతో మ‌ళ్లీ రూట్ మార్చ‌డానికి రెడీ అవుతున్నాడు నాని. ప్ర‌స్తుతం నాగార్జున‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు ఈ హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య దీనికి ద‌ర్శ‌కుడు. ఈ క‌థ పూర్తిగా కామెడీగా సాగుతుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమా త‌ర్వాత కొత్త క‌థ ఉంటే త‌ప్ప సినిమాకు డేట్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయిపోయాడు న్యాచుర‌ల్ స్టార్. లేక‌పోతే వ‌చ్చిన పేరు చేజేతులా పోగొట్టుకున్న వాడు అయిపోతాడు నాని. 

More Related Stories