English   

హ‌మ్మ‌య్యా.. నాని నోరు విప్పాడు..!

nani open up on sri reddy issue
2018-06-12 08:28:00

ప్ర‌తీ మ‌నిషిలోనూ ఓపిక అనేది ఉంటుంది. కానీ అది ఎప్ప‌టి వ‌ర‌కు మ‌న స‌హ‌నం న‌శించ‌నంత వ‌ర‌కే. ఒక్క‌సారి స‌హ‌నం న‌శిస్తే ఓపిక పాడు అంటూ ఏమీ ఉండ‌దు. ఎదుటి వాడు కామ్ గా ఉన్నాడంటే అర్థం.. వాళ్ల‌కు భ‌రించే శ‌క్తి ఉందని. అలా అని రోజంతా స‌తాయిస్తూ ఉంటే ఏదో ఓ స‌మ‌యంలో ఆ ఓపిక పోతుంది క‌దా..! ఇప్పుడు నానికి కూడా ఇదే జ‌రిగింది. ఇన్ని రోజుల నుంచి శ్రీ‌రెడ్డి త‌న‌ను ఇంత‌గా టార్చ‌ర్ చేస్తున్నా.. సోషల్ మీడియాలో ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తున్నా కూడా ఏమీ అన‌లేదు నాని. దానికి ఎందుకు అనే స‌మాధానం కూడా నానిని ఎవ‌రు అడ‌గ‌లేదు. ఎందుకంటే అది త‌న ప‌ర్స‌న‌ల్. కానీ మ‌రీ కుటుంబాల‌ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే విధంగా శ్రీ‌రెడ్డి మాట్లాడుతుంటే.. నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నాడ‌నే డౌట్ లు చాలా మందికి వ‌చ్చాయి. దాంతో ఇప్పుడు నాని స్పందించాడు. ఎందుకు కాన్స‌ట్రేట్ చేయ‌డం.. అన‌వ‌స‌రంగా ప‌ట్టించుకుని వాళ్ల‌ను పెద్ద వాళ్ల‌ను చేయ‌డం ఎందుకు అన్న‌ట్లు ఇన్నాళ్లూ వ‌దిలేసాడు నాని. ఇప్పుడు ఇష్యూ మ‌రీ సీరియ‌స్ లెవ‌ల్ కు వెళ్లిపోయేస‌రికి స్వ‌యంగా ఈయ‌నే రంగంలో దిగాడు. త‌న లాయ‌ర్ నుంచి లీగ‌ల్ నోటీస్ పంపాడు న్యాచుర‌ల్ స్టార్. ఎంత భ‌రించ‌డానికైనా ఓ ఓపిక అనేది ఉంటుంది క‌దా.. అది త‌న‌కు ఇప్పుడు న‌శించింది అని చెప్పాడు నాని. ఆధారాలు లేకుండా ఏది ప‌డితే అది వాగితే బాగుండ‌దంటూ కాస్త సీరియ‌స్ గానే రియాక్ట్ అయ్యాడు నాని. అంతే కాదు అంద‌రికీ ఫ్యామిలీస్ ఉంటాయ‌ని సంగ‌తి కాస్త గుర్తు పెట్టుకుంటే మంచిది అంటూ నాని క‌మెంట్ చేసాడు. మొత్తానికి ఇన్నాళ్లూ వార్ వ‌న్ సైడ్ మాదిరి శ్రీ‌రెడ్డి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడేసింది.. కానీ ఇప్పుడు నాని సైడ్ నుంచి కూడా మాట‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి ఇది ఎక్క‌డ ఎప్పుడు ఎలా ఆగుతుందో చూడాలి..!

More Related Stories