English   

చిరంజీవి సినిమా నాని రీమేక్..

chiru and nani
2018-02-17 19:19:32

కొన్ని సినిమాలు అలా ఉంటేనే బావుంటాయి. రీమేక్ లనీ.. ఆ సినిమాల్లోని పాటలనీ రీమిక్స్ లనీ మళ్లీ చూపిస్తే ఆ ఫ్లేవర్ పోతుంది. ఈ విషయం ఇప్పటికే చిరంజీవి పాటలను రీమిక్స్ చేస్తూ ప్రతిసారీ చెడగొడుతోన్న సాయిధరమ్ తేజ్ నిరూపిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఇంటిలిజెంట్ లో తేజూ చేసి ఛమక్ ఛమక్ ఛాం పాట ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాను నాని రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు షాకిస్తున్నాయి.

లేటెస్ట్ గా నాని నిర్మించిన అఁ థియేటర్స్ లోకి వచ్చింది. కానీ పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఈ టైమ్ లో నాని చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే చిరు ఫ్యామిలీ హీరోలే చిరు పాటల్ని చెడగొడుతున్నారు. అలాంటిది నాని ఏకంగా సినిమా రీమేక్ చేస్తానంటే ఫ్యామిలీ ఏమో కానీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇంతకూ నాని చేయాలనుకుంటోన్న ఆ చిరు మూవీ ఏంటో తెలుసా.. చంటబ్బాయ్. జంధ్యాల డైరెక్షన్ లో తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేసిన చిరంజీవి చేసిన సినిమా. జేమ్స్ పాండ్ గా మెగాస్టార్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ కు ఆ సినిమా అప్పట్లో బానే ఆడింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా వచ్చిన చంటబ్బాయ్ నే నేటి ట్రెండ్ కు అనుగుణంగా మార్చి నాని రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అయితే ఈ మూవీకి తను నిర్మాతగా ఉంటాడా.. హీరోగా కూడా చేస్తాడా అనేది తేలలేదు. అయితే హీరోగా చేయడం మాత్రం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే నానికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ కొత్త చంటబ్బాయ్ ఎవరనేది చూడాలి. 

More Related Stories