English   

ఇంద్ర‌గంటి హీరోలు వాళ్లిద్ద‌రేనా..? 

indragantimohankrishna
2018-07-15 19:23:46

మెల్ల‌గా తను కూడా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ అనిపించుకుంటున్నాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. కంటెంట్ ఉన్నోడి క‌టౌట్ చాలు ర‌ప్ఫాడించ‌డానికన్న‌ట్లు ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన స‌మ్మోహ‌నం సినిమా చూసిన త‌ర్వాత ఇదే అనిపిస్తుంది. ఇందులో సూప‌ర్ స్టార్స్ లేరు. కానీ క‌థ ఉంది.. కామెడీ ఉంది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకునే ఎమోష‌న్స్ ఉన్నాయి. అందుకే కాస్త నెమ్మ‌దిగా అయినా ప్రేక్ష కుల‌ను బాగానే రీచ్ అయింది ఈ చిత్రం. ఈ చిత్రంతోనే అదితిరావ్ తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే ఇప్పుడు మ‌రో భారీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. 

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ బాగా న‌డుస్తుంది క‌దా..! అందుకే ఇప్పుడు ఈయ‌న కూడా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కు క‌థ సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాపై ఇప్ప‌టికే దిల్ రాజు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. అయితే హీరోల‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆ ఇద్ద‌రూ నాని, శ‌ర్వానంద్ అని తెలుస్తుంది. ఇద్ద‌రికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. పైగా ఇంద్ర‌గంటికి నాని అంటే చాలా ఇష్టం.. శ‌ర్వాతో కూడా సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్ద‌రికే ఇప్పుడు క‌థ చెప్పి ఒప్పించిన‌ట్లు తెలుస్తుంది. అన్నింటికీ మించి దిల్ రాజుతో సినిమా అంటే నాని గానీ.. శ‌ర్వా కానీ నో చెప్పే స‌మ‌స్యే ఉండ‌దు. దాంతో ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కు అంతా సిద్ధ‌మ‌వుతుంది ఇప్పుడు. మ‌రి ఈ చిత్రంతో ఇంద్ర‌గంటి రేంజ్ ఇంకెక్క‌డికి వెళ్తుందో చూడాలిక‌..

More Related Stories