English   

ఓటీటీలో నాని సుధీర్ బాబుల వి సినిమా

V movie
2020-08-12 17:19:38

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమాను మార్చ్ 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది ఈ చిత్రం. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ తో బేరం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ ఐదవ తేదీన అమెజాన్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బడ్జెట్ కంటే ఎక్కువ గా అమెజాన్ ఆఫర్ చేసిందని అందుకే ఈ సినిమాను అమెజాన్లో విడుదల చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. వాస్తవానికి థియేటర్ లోనే విడుదల చేయాలనీ భావించారు. అయితే ఎన్నాళ్లయినా థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. వడ్డీల భారం నుంచి తప్పించుకోవడానికి. ఇంతకంటే మంచి ఆఫర్ రాదు అనుకుని. ఈ సినిమాని అమెజాన్లో విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన త్వరలోనే వస్తుంది. 

More Related Stories