English   

ఈ సారి నానియే బాస్..

Nani-Telugu

బిగ్ బాస్ సీజన్ -2కు హోస్ట్ ఎవరో అనే ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడింది. నేచురల్ స్టార్ నాని బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-2ను హోస్ట్ చేసేందుకు ఒకే చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ తర్వాత ఎవరా అనే క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పడింది. నిజానికి ఈ సెకండ్ సీజన్ ను కూడా ముందు ఎన్టీఆరే హోస్ట్ చేస్తాడనుకున్నారు. మొదట్లో అతను కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఈ లోగా త్రివిక్రమ్ సినిమా కాస్త లేట్ అయింది. అటు రాజమౌళితో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు. వీటిలో త్రివిక్రమ్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే డేట్స్ మార్చడం కష్టమైపోతుంది. అందుకే ఫస్ట్ సీజన్ కంటే బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేసినా యంగ్ టైగర్ చేయలేనని చెప్పాడు. ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయగల టాలెంటెడ్ హోస్ట్ కోసం బిగ్ బాస్ టీమ్ గట్టిగానే అన్వేషించింది. ఒక దశాలో రానాను తీసుకోవాలనుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ చేస్తాడని వినిపించింది. అదే టైమ్ లో నాని అయితే బావుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. ఫైనల్ గా బిగ్ బాస్ టీమ్ నానికే ఓటేసింది. అటు నాని కూడా ఇంట్రెస్టెడ్ గా ఉండటంతో డీల్ సెట్ అయిందిని చెబుతున్నారు. నాని కూడా చాలాసార్లు ఓపెన్ డయాసెస్ లో బాగా మాట్లాడాడు. తెలుగుపై అతనికి మంచి కమాండ్ కూడా ఉంది. బిగ్ బాస్ పై ఆల్రెడీ ఓ అవగాహన వచ్చింది కాబట్టి.. నాని లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కు ఇప్పుడు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మొత్తంగా జూన్ లేదా జూలైలో ప్రారంభం కాబోతోన్న బిగ్ బాస్ సీజన్ -2కు నానియే ఫైనల్ అనేది మాగ్జిమం ఫిక్స్ అయిపోవచ్చు. 

More Related Stories