English   

క్రికెట‌ర్ అర్జున్ గా నాని 

nani-jersy

నేచుర‌ల్ స్టార్ నాని కొత్త జెర్సీ వేస్తున్నాడు. అదేంటీ.. జెర్సీలు స్పోర్ట్స్ ప్లేయ‌ర్స్ క‌దా వేస్తారు అనుకుంటున్నారా.. అఫ్ కోర్స్ అలాంటి పాత్ర‌లోనే నాని కూడా క‌నిపించ‌బోతున్నాడు. అందుకే ఈ  సినిమాకు జెర్సీ  అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అన్న‌ట్టు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా..? మ‌ళ్లీరావా అంటూ ఆగిపోయిన సుమంత్ కెరీర్ కు కొత్త ఊతం ఇచ్చిన గౌత‌మ్ తిన్న‌నూరి. మ‌ళ్లీరావాకు ఫీల్ గుడ్ సినిమాగా మంచి మార్కులు ప‌డ్డాయి. త‌ర్వాత కుర్రాడి కోసం చాలామంది యంగ్ స్టార్స్ చూశారు. ప్ర‌స్తుతం గౌత‌మ్ చేయ‌బోతోన్న ఈ సినిమాను ముందుగా బెల్ల‌కొండ శ్రీనివాస్ తో చేయాల‌నుకున్నారు. కానీ క‌థ‌ను బ‌ట్టి ఇందులో చాలా ఎమోష‌న్స్ పండించాలట‌. ఒక ర‌కంగా హైఎండ్ ఎమోష‌న్స్ ఉంటాయ‌ని.. ఇలాంటి జానర్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని విజువ‌ల్స్ ఈ క‌థ‌లో ఉంటాయ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌టించింది. అందుకే ఈ కథ  నానికి షిఫ్ట్ అయింది.
 
కథానుగుణంగా ఈ సినిమాకు జెర్సీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పపెట్టేశారు. దీంతో పాటు ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఈ లుక్ లో ఓ క్రికెట్ బ్యాట్ట‌, హెల్మెట్, గ్లౌస్, ప్యాడ్స్ ఉన్నాయి. అలాగే వెన‌క గోడ‌కు ఓ జెర్సీ కూడా త‌గిలించింది. ఉంది. ఆ జెర్సీకి అర్జున్ అనే పేరుంది. అంటే నాని ఈ సినిమాలో అర్జున్ అనే క్రికెటర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ నాని చాలా పాత్ర‌లు చేశాడు. గ‌తంలో ప్లేయ‌ర్ అన‌లేం కానీ.. క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ లో ఆ ప్లేయ‌ర్ గా న‌టించాడు. ఇప్పుడు క్రికెటర్ గా. 

మ‌రో విశేషం ఏంటంటే.. బెస్ట్ టాలెంట్ ను పిక‌ప్ చేయ‌డంలో ముందుండే సితారా ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది ఒక‌ర‌కంగా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరికి ప్ర‌మోష‌న్ అనుకోవ‌చ్చు. అలాగే సితారాలో సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ కాబ‌ట్టి.. నాని ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌బోతోంద‌ని కూడా అనుకోవ‌చ్చు. 

More Related Stories