English   

ఛలో బ్యూటీతో నాని రొమాన్స్ 

Rashmika-Mandhana
2018-03-19 12:55:25

ఛలోతో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఆల్రెడీ కన్నడలో కిరిక్ పార్టీ బ్లాక్ బస్టర్ తో అక్కడి టాప్ స్టార్స్ అంతా అమ్మడిపై కన్నేశారు. ఛలో తర్వాత మరో ప్రామసింగ్ ఆఫర్ వచ్చింది. అది కూడా భారీ మల్టీస్టారర్ లో. పర్ఫార్మెన్స్,  గ్లామర్ కలిపి చూపించగల టాలెంట్ అమ్మడి సొంతం. అందుకే నాని సినిమాలో ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. నాని, నాగార్జున  కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ లో నాని సరసన రష్మికనే తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. అందులో ఇదీ ఒకటి. కాకపోతే ఇది నిజంగానే నిజం అనే వారి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. 

నాని, నాగార్జున అనే ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇప్పటికే అంచనాలు పెంచింది. దర్శకుడిపై నమ్మకం కూడా చాలా ఉంది. పైగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వస్తోన్న సినిమా. కాబట్టి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తుందంటున్నారు. అయితే హీరోయిన్ల విషయలో ఇప్పటికే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఫైనల్ అనే విషయం మూవీ టీమ్ కన్పార్మ్ చేయకపోయినా వినిపిస్తోన్న దాన్ని బట్టి నాని సరసన రష్మిక మందన్నా ఆల్మోస్ట్ ఫైనల్ అయిందంటున్నారు. ఇక నాగార్జున సరసన కూడా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ను తీసుకున్నట్టు గతంలోనే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి డస్కీ బ్యూటీ అమలా పాల్ వచ్చిందంటున్నారు. నాగ్ విషయంలో ఎవరున్నా ఓకే కానీ.. నానితో రష్మిక కాంబినేషన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇద్దరూ టాలెంటెడ్ కాబట్టి.. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ కూడా చూడ్డానికి బావుంటుందనుకోవచ్చు. 

More Related Stories