English   

ర‌వితేజ ల‌వ‌ర్ తో నాని రొమాన్స్..

malvika sharma and nani

ఛీఛీ.. ఏంటిది అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో అంతే మ‌రి.. ఓ సినిమాలో ఓ హీరోతో న‌టించిన ముద్దుగుమ్మ న‌టిస్తే.. ఆ సినిమా పూర్త‌య్యేవ‌ర‌కు ఆమె కేరాఫ్ ఆ హీరోనే. ఇప్పుడు ఇండ‌స్ట్రీలోకి కొత్త‌మ్మాయి మాళ‌విక శ‌ర్మ వ‌చ్చేసింది. ఈమె కేరాఫ్ ఇప్పుడు ర‌వితేజ‌. క‌ళ్యాణ్ కృష్ణ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే చాలా యాడ్స్ లో న‌టించింది మాళ‌విక‌. టీవీ ప్రేక్ష‌కుల‌కు బాగానే ప‌రిచ‌యం ఈ మొహం. ఇప్పుడు సినిమాల‌కు కూడా ప‌రిచ‌యం కానుంది. ర‌వితేజ సినిమా ఇంకా పూర్తి కాక‌ముందే అప్పుడే మాళ‌విక శ‌ర్మ వైపు మ‌న హీరోల క‌ళ్లు ప‌డుతున్నాయి. ఇప్పుడు నాని కూడా ఈ భామ‌తోనే రొమాన్స్ అంటున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. దాంతో పాటు ఈ మ‌ధ్యే శ్రీ‌రామ్ ఆదిత్య‌తో కొత్త సినిమా మొద‌లుపెట్టాడు. ఈ సినిమాలో నాగార్జున మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. అశ్వినీద‌త్ నిర్మాత‌. ఈ సినిమాలో నానికి జోడీగా మాళ‌విక‌శ‌ర్మ‌ను తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ లో మొద‌లు కానుంది. మొత్తానికి ర‌వితేజ ల‌వ‌ర్ తో ఇప్పుడు నాని రొమాన్స్ చేస్తున్నాడ‌న్న‌మాట‌.

More Related Stories