English   

ఇది కదా కాంబినేషన్ అంటే..?

nani
2018-02-17 11:03:09

నాని.. ఏం చేసినా సెన్షేషన్ అవుతోందిపుడు. అందుకే అతని గురించి వార్త అంటే చాలు.. వెంటనే ఆరాలు తీస్తున్నారు చాలామంది. ప్రస్తుతుం నిర్మాతగా మారి తీసిన అఁ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం తను నటిస్తోన్న సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నాని ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. అయితేనాని చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత అతను చేయబోయే సినిమా గురించి వస్తోన్న వార్త అతని అభిమానుల్నే కాదు.. ఫిల్మీ లవర్స్ ను కూడా ఎగ్జైట్ చేస్తోంది. అసలు నాని అంటేనే స్టోరీ సెలక్షన్స్ లో క్లవర్ కదా. అలాంటి అతను ఇప్పుడు మరో క్లెవర్ డైరక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. 

కథల విషయంలో ప్రతి సినిమాతో ఆశ్చర్యపరిచే దర్శకుడు విక్రమ్ కుమార్. 13బి, ఇష్క్, మనం, 24, హలో ఇలా.. ఏ కథా మరో కథతో పోలికే ఉండదు. అలాగే రొటీన్ అనే పదమూ ఈ కథల్లో వినిపించదు. అదే విక్రమ్ ను స్పెషల్ డైరెక్టర్ గా మార్చింది. ఇప్పుడు విక్రమ్ నాని తో సినిమా చేయబోతున్నాడనేదే ఈ ఎగ్జైటింగ్ న్యూస్. నిజంగా ఇదే వర్కవుట్ అయితే ఖచ్చితంగా ఇది వెరీ వెరీ స్పెషల్ కాంబినేషన్ అవుతుంది. కాకపోతే ఈ కాంబినేషన్ సెట్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. రీసెంట్ గా విక్రమ్ .. నానిని కలిసి కథ లైన్ చెప్పాడట. అది నానికి నచ్చింది. విక్రమ్  కథపై వర్కవుట్ చేస్తున్నాడు. విక్రమ్ ఎలాగూ కథను రాసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటాడు. ఈ లోగా నాని తను కమిట్ అయిన సినిమాలు ఫినిష్ చేస్తాడు. అంటే ఒకవేళ ఓకే అయినా ఈ కాంబినేషన్ సెట్స్ ఎక్కడానికి 2019వరకూ పడుతుంది. అయినా సరే.. ఇది క్రేజీ కాంబినేషనే.. కాదంటారా..?

More Related Stories