English   

శ్రీ రెడ్డి కి నాని ఫైనల్ వార్నింగ్..

nani warning to sri reddy
2018-06-12 08:01:51

నాని వర్సెస్ శ్రీ రెడ్డి.. గత కొంతకాలంగా ఈ వార్ ఒన్ సైడ్ ఉంది. కానీ ఇప్పుడు నాని కూడా రంగంలోకి దిగాడు. శ్రీ రెడ్డిపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. దీనిపై తను కూడా న్యాయపోరాటం చేస్తానంటూ మళ్లీ కౌంటర్ వేయడంతో ఈ వార్ ఇంకా ముదురుతున్నట్టు అర్థమౌతోంది. లేటెస్ట్ గా నాని శ్రీ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.. దాన్ని బట్టి నాని అన్నదేమంటే.. ‘’నేను ఆ రొచ్చులోకి దిగను.. అలాగే వారు నా నుంచి కోరుకుంటున్నదీ ఇవ్వను. దీన్ని లీగల్ గానే ఎదుర్కొంటాను. పరువు నష్టం కోసం ఇప్పటికే దావా వేశాను. ఇవి నన్ను డిస్ట్రబ్ చేస్తున్నాయి. అయినా నేను దీని గురించి బాధ పడడం లేదు. నా బాధ మనకోసం. మనం ఏం సమాజంలో ఉన్నాం. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అర్థం లేని ఆధారం లేని ఆరోపణలు చేస్తూ లాభాల్ని పొందుతున్నారు. అలాంటి వారికీ కుటుంబం ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ’’.. అంటూ ఓ ఘాటైన ట్వీట్ చేశాడు.. 

అయితే దీనికి తను ‘ఖచ్చితంగా.. మనం లీగల్ గానే పోరాడదాం’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఎవరి మాటల్లో ఏ నిజాలున్నాయనేది నిజంగానే ఎవరికీ తెలియదు. కానీ ఇలాంటి గొడవలు వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీస్తాయి. కొంత వరకూ భరించినా.. సహనానికీ ఓ హద్దుంటుంది. అందుకే నాని ఇలాంటి రిప్లై ఇచ్చి ఉండొచ్చు.కానీ అవతలి వ్యక్తి మరింత అప్రమత్తంగా ఉండటానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. ఏదేమైనా ఇన్నాళ్లూ ఒన్ సైడ్ గా ఉన్న ఈ గొడవ ఇప్పుడు టూ సైడ్స్ గా మారింది. మరి ఈ గొడవ ఎటు టర్న్ అవుతుందో.. ఎవరి లైఫ్ ను బర్న్ చేస్తుందో కానీ.. వీరి వార్ మాత్రం బాగా ముదురుతోంది.. 

More Related Stories