English   

  వామ్మో నానికి బాగా కోప‌మొచ్చింది.. 

nani

నాని చాలా కూల్ గా క‌నిపిస్తుంటాడు. ఎప్పుడూ న‌వ్వుతూనే ఉంటాడు. ఎప్పుడో కానీ ఆయ‌న మొహంలో న‌వ్వు మాయం కాదు. కానీ ఇప్పుడు మాయం అయింది. అది కూడా మీడియా వ‌ల్లే. అవును.. ఇదివ‌ర‌కే ఓ సారి మీడియాపై గుర్రుమ‌న్నాడు నాని. ఏం రాస్తున్నారో.. ఎందుకు అలా రాస్తున్నారో కాస్త తెలుసుకుని రాయండంటూ సీరియ‌స్ అయ్యాడు నాని. నిజాలు తెలుసుకుని రాస్తే అంద‌రికీ మంచిది అని.. ప‌ర్స‌న‌ల్ గా వెళ్ల‌నంత వ‌ర‌కు ఏం రాసినా ఓకే అన్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇక ఇప్పుడు మ‌రో విష‌యంపై సీరియ‌స్ అయ్యాడు నాని. టీవీ ఛానెల్స్ లో ఈ మ‌ధ్య ఓ ఇష్యూని బాగా చూపిస్తున్నారు.

అది ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచ్. ప్ర‌తీ రోజు టీవీ పెడితే అది త‌ప్ప మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. ఓ ప్ర‌ముఖ ఛానెల్ పెద్ద మ‌నిషి యాంక‌ర్ స్థానంలో ఉండి.. అన‌కూడ‌ని మాట‌లు కూడా అనేసాడు. దానికి పోసాని రిప్లై ఇస్తూ ఒక‌టికి ప‌దిసార్లు కోట్లాది మంది చూస్తోన్న టీవీల్లోనే మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ ప‌దాన్ని రిపీట్ చేసాడు. ఇదంతా చాలా మందికి ఇబ్బందిగా అనిపించింది కూడా. ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ పెద్ద త‌ల‌కాయ‌లు ఏమీ మాట్లాడ‌లేదు. కానీ ఇప్పుడు నాని నోరెత్తాడు. ఈయ‌న ట్వీట్ చేసాడు. మీడియాపై కోపం వ‌చ్చింది ఈ హీరోకు. అందుకే వెంట‌నే ఓ ట్వీట్ చేసాడు. 

టీవీ ఛానల్స్.. వాటి వ్యాఖ్యాతలు.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్.. కొంత కాలగా సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తుండడాన్ని బాధేస్తుంది. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. చిన్న పిల్లలు చూస్తున్నారు.. చాలు.. ఇక ఆపండి అంటూ ట్వీట్ చేశాడు నాని. ఈయ‌న మాట్లాడిన దాంట్లో త‌ప్పేం లేదు. ఎందుకంటే మీడియా నిజాలు చెప్పొచ్చు కానీ ఎంత‌వ‌ర‌కు దానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంది క‌దా..? ఇంట్లో చిన్న పిల్ల‌లు ఉన్న‌పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి.. ఇండ‌స్ట్రీలో అమ్మాయిలు ఇలా ఉంటారా.. ఇవ‌న్నీ వాళ్ల‌కు ఎందుకు అవ‌స‌రం చెప్పండి..? ఇలాంటి విష‌యాలు ఇప్పట్నుంచే వాళ్ల బుర్ర‌ల్లోకి ఎక్కించాలా..? అది అవ‌స‌రమా..? అస‌లే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అందులోనే ప్ర‌పంచం క‌నిపిస్తుంది. ఇప్పుడు ఇది చాల‌ద‌న్న‌ట్లు మ‌ళ్లీ మీడియాలో ర‌చ్చ ఒక‌టి. మ‌రి ఈ విష‌యంలో నాని ఇచ్చిన స‌లహాను ఎవ‌రు పాటిస్తారో చూడాలిక‌..?

More Related Stories