English   

కొర‌టాలతో నాని.. ఇది ఫిక్స్..!

Nani-koratala-siva

కొర‌టాల త‌ర్వాతి సినిమా ఏంటి..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే డిస్క‌ష‌న్. ఆయ‌న ఎవ‌రితో సినిమా అనౌన్స్ చేస్తాడో తెలియ‌క చాలా మంది ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయితే స్టార్ హీరోలంద‌రికీ షాక్ ఇస్తూ.. కొర‌టాల ఈ సారి చిన్న హీరోతో వెళ్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన నాలుగు సినిమాలు స్టార్ హీరోల‌తోనే. అందులో మ‌హేశ్ బాబుతో రెండు సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత ఆయ‌న పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇప్ప‌ట్లో సినిమా అనౌన్స్ చేయ‌న‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తే మాత్రం కొర‌టాల త‌ర్వాతి సినిమా నానితో ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ కాంబినేష‌న్ పై ఇటు కొర‌టాల కానీ.. అటు నాని గానీ మాట్లాడ‌లేదు కానీ ఈ ఇద్ద‌ర్ని క‌లిపేస్తూ ఆ మ‌ధ్య అనౌన్స్ మెంట్ అయింది వ‌చ్చింది. యువ‌సుధ‌ ప్రొడ‌క్ష‌న్స్ లో మిక్కిలినేని సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే కొర‌టాల శివ మాత్రం ఈ మ‌ధ్యే నాని సినిమాపై నో క‌మెంట్స్ అన్నాడు. అయితే ఓ సినిమా త‌ర్వాత మ‌రో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉంచే నాని.. శ్రీ‌రామ్ ఆదిత్య త‌ర్వాత ఏ సినిమా చేస్తున్నాడో చెప్ప‌ట్లేదు. దీన్నిబ‌ట్టి చూస్తుంటే కొర‌టాల సినిమా నానితోనే ఉంటుంద‌ని అర్థ‌మౌతుంది. 

More Related Stories