English   

నాని టక్ జగదీష్ విడుదల వాయిదా

Nani
2021-04-13 11:35:43

నేచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా  విడుదలపై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. "ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల ‘టక్‌ జగదీష్‌’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తా" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. 

నాని మాట్లాడుతూ.. ''టక్ జగదీష్ రీ రికార్డింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది ఫ్యామిలీ మొత్తం ఇంటిళ్లపాదీ కలసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ ఏడాది క్రాక్ నుంచి వకీల్ సాబ్ వరకు  ఎన్నో బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్స్ చేశారు. తెలుగు వాళ్ళని సినిమాని సెపరేట్ చేయలేం. కానీ కొత్త సినిమాల రిలీజుల విషయంలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. ఉగాదికి టక్ జగదీష్ ట్రైలర్ రావడం లేదు. ఎప్పుడిస్తే అపౌడు6అందులో రిలీజ్ డేట్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 23 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాం'' అని చెప్పుకొచ్చారు. 

More Related Stories