English   

బలే ఆటగాళ్లు వచ్చేస్తున్నారు..

Nara Rohit and Jagapathi Babu Aatagalu Movie coming soon

నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఆటగాళ్లు. చాన్నాళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ కనిపించలేదు. కానీ ఈ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఆటగాళ్లు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్   అనౌన్స్ చేశారు. గ్యాంగ్ స్టర్ పోలీస్ కథ వినిపిస్తోన్న ఈ మూవీని జూలై 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

నారా రోహిత్ చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలున్నాయి.కానీ వీటి ప్రోగ్రెస్ గురించిన సమాచారం మాత్రం కరెక్ట్ గా లేదు. అతను ఏం సినిమా చేస్తున్నాడు. వాటి షూటింగ్ అప్డేట్స్ ఏంటీ అనే విషయంలో ఎప్పుడూ ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుంది. తర్వాత కొన్ని రోజుల్లోనే వరుసగా సినిమాలు వస్తాయి. వచ్చిన వాటిలో మెరిసే వాటి కంటే పోయేవే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఈ మధ్య బాగా ఫిజిక్ తగ్గించుకుని చేసిన సినిమా ఇది. ఇక జగపతిబాబుతో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేశాడు. ఈ ఇద్దరి పాత్రలే సినిమాకు హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు. రేసీగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలం అంటున్నారు. మరి ఈ ఆటగాళ్లు బాక్సాఫీస్ వద్ద ఆడి గెలుస్తారా లేదా అనేది చూడాలి. 

More Related Stories