English   

నిశ్శబ్ధమే నారా రోహిత్ ఆయుధం 

Nara-Rohit-Shabdam
2018-03-19 09:07:35

ప్రయోగాత్మక కథలతోనే బాణంలా ఎంట్రీ ఇచ్చిన హీరో నారా రోహిత్. మొదట్నుంచీ ట్రెండ్ కు భిన్నంగా వెళుతోన్న ఈ హీరో లేటెస్ట్ గా మరో భారీ ఎక్స్ పర్మెంట్ చేస్తున్నాడు. ఈ సారి ఏకంగా సినిమా అంతా మూగ వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ శబ్ధం. మూగవ్యక్తికి ఈ టైటిలే అదిరిపోయిందంటే.. క్యాప్షన్ ఇంకా కిరాక్ గా ఉంది. అతని నిశ్శబ్ధమే అతని ఆయుధం అనేది క్యాప్షన్. మంజునాథ అనే అతను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను గతంలో లేడీస్ అండ్ జెంటిల్మన్ అనే సినిమా చేశాడు. ఇది ప్రశంసలు అందుకున్నా.. కాస్త అడల్ట్ కంటెంట్ ఉందనే విమర్శలూ అందుకుంది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న మంజునాథ ఇన్నాళ్లకు ఓ మంచి కథతో నారా రోహిత్ ను మెప్పించాడు. లేటెస్ట్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీకి అట్లూరి నారాయణరావు నిర్మాత. షూటింగ్ కంటిన్యూస్ గా జరగబోతోంది.  ప్రస్తుతం రోహిత్ నీదీనాదీ ఒకేకథ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దీంతో పాటు తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మొత్తంగా కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటోన్న రోహిత్ శబ్ధంతో బాక్సాఫీస్ వద్ద ఎంత సౌండ్ చేస్తాడో కానీ.. ఇప్పటికైతే ఈ శబ్ధం వినసొంపుగా ఉందనేది నిజం. 

More Related Stories