English   

మర్డర్ కేస్ లో నారా రోహిత్

Nara Rohith Aatagaallu

నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ఆటగాళ్లు. జగ్గూ భాయ్ లాయర్ గా, రోహిత్ సినిమా హీరోగా నటించారీ సినిమాలో. ఆటగాళ్లు అంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ ఇవాళ విడుదలైన టీజర్ చూస్తే ఇదో డిఫరెంట్ సస్పెన్స్ మూవీగా తెలుస్తోంది. రోహిత్ భార్యను ఎవరో చంపేస్తారు. అతనే చంపాడు అనే అభియోగంతో కేస్ కోర్ట్ కు వస్తుంది. అంటే అతనిపై మర్డర్ కేస్ ఫైల్ అవుతుందన్నమాట. ఆ కోర్ట్ లో ఇతనికి వ్యతిరేకంగా కేస్ వాదించే లాయర్ జగ్గూ భాయ్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్యా సాగే రేసీ గేమే ఈ ఆటగాళ్లు అని అర్థమౌతోంది.  

టీజర్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. రెగ్యులర్ స్టోరీస్ ను రోహిత్ యాక్సెప్ట్ చేయడు. అలాగే జగ్గూభాయ్ కి కూడా ఇది వెరైటీ రోల్ లా ఉంది. హత్యకు సంబంధించిన క్లూస్ కోసం లాయర్ ప్రయత్నిస్తున్నప్పుడు రోహిత్ అతనికి వార్నింగ్ ఇవ్వడం.. తర్వాత ‘‘ఆట నువ్వు మొదలుపెట్టావ్.. నేను ఫినిషింగ్ ఇస్తాను’’ అంటూ జగపతిబాబు చెప్పిన డైలాగే ఈ సినిమాకు కీలకం అనుకోవచ్చు.  సో ఇది ఒక హత్య చుట్టూ తిరిగే కథ. ఇలాంటి స్టోరీస్ కాస్త రేసీగా ఉంటేనే ఆకట్టుకుంటాయి. టీజర్ చూస్తే అదే అర్థమౌతోంది. సో.. ఆటగాళ్లు ఆకట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. 

More Related Stories