English   

ఈ వారమన్న రష్మీకి కలిసొస్తుందా..?

Nara Rohith Aatagallu Anchor Rashmi Gautam Anthalku Minchi Movie
2018-08-21 07:47:12

ఒక్కో శుక్ర‌వారం వ‌స్తుంటే వ‌స్తున్న సినిమాల సంఖ్య ఇంకా పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. ఈ వారం కూడా ఇదే జ‌రుగుతుంది. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు ఈ వారం వ‌స్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా పెద్ద‌గా ఏం లేవు. అయితే మ‌రీ ఊరుపేరు లేని వాళ్లు న‌టించిన సినిమాలైతే కాదు. అందుకే కాస్తోకూస్తో ఆ ఆస‌క్తి అయితే క‌నిపిస్తుంది. ఆగ‌స్ట్ 24న నాలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. అందులో ముందుగా అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తున్న సినిమా నీవెవ‌రో. ఇప్ప‌టికే త‌మిళ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆది.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీపై ప‌డ్డాడు.

ఇక్క‌డ విల‌న్ గా మొద‌లుపెట్టి.. స‌పోర్టింగ్ కారెక్ట‌ర్స్ చేస్తూ ఇప్పుడు మ‌ళ్లీ హీరో అయ్యాడు. నిన్నుకోరితో కోన వెంక‌ట్ కు ఆది బాగానే క్లోజ్ అయిపోయాడు. దాంతో ఇదే హీరోతో ఇప్పుడు నీవెవ‌రో సినిమా నిర్మించాడు కోన‌. త‌మిళ్ లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న అవే క‌న్నంగ‌ల్ సినిమాకు ఇది రీమేక్. హ‌రినాథ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఆగ‌స్ట్ 24న విడుద‌ల కానుంది. తాప్సీ ఇందులో విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. రితికా సింగ్ మ‌రో హీరోయిన్ గా న‌టించింది. ఇక ఇదే రోజు నారా రోహిత్ ఆట‌గాళ్లు కూడా విడుద‌ల అవుతుంది. ఏడాదికి అర‌డ‌జ‌న్ సినిమాలు చేస్తున్నాడు కాబ‌ట్టి నారా వార‌బ్బాయి సినిమాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు ప్రేక్ష‌కులు.. కానీ మ‌నోడి సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ క‌థ మంచిది ప‌డుతుంటుంది.

ప‌రుచూరి ముర‌ళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌భుదేవా ల‌క్ష్మీ సినిమా సైతం ఇదే రోజు విడుద‌ల కానుంది. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రం డాన్స్ నేప‌థ్యంలో సాగుతుంది. ర‌ష్మి అంత‌కుమించి కూడా ఆగ‌స్ట్ 24నే వ‌స్తుంది. కేవ‌లం ర‌ష్మి అందాల‌పైనే ఈ సినిమా ఆడాలి.. వేరే ఆప్ష‌న్ కూడా లేదు. మ‌రి వీటిలో ఏది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేస్తుందో చూడాలిక‌. అన్న‌ట్లు ఈ సినిమా ఏది ఆడాల‌న్నా ముందు గీత‌గోవిందాన్ని త‌ట్టుకోవాలి. అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అరాచ‌కం చేస్తుంది.

More Related Stories