English   

నారా వార‌బ్బాయా మ‌జాకా..!

nara rohith
2018-07-25 08:35:48

నేను న‌ర‌కడం మొద‌లుపెడితే ఏ ముక్క ఎవ‌డితో తెలుసుకోడానికి వారం ప‌ట్టుద్ది అని అప్ప‌ట్లో బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా..! అయినా అంత సింపుల్ గా మరిచిపోయే డైలాగ్ కాదులే అది. అచ్చంగా ఇప్పుడు నారా రోహిత్ ను చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. ఈయ‌న సినిమాలు చేయ‌డం మొద‌లుపెడితే ఏ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో తీసిన ద‌ర్శ‌కుడికి.. డ‌బ్బులు పెట్టిన నిర్మాత‌కు.. అంతెందుకు న‌టించిన నారాకు కూడా తెలియ‌దు. ఎందుకంటే ఎప్పుడూ అన్ని సినిమాలతో బిజీగా ఉంటాడు కాబ‌ట్టి. ఇప్పుడు కూడా జులై 25న ఈయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూడు సినిమాల ఫ‌స్ట్ లుక్ లు విడుద‌లయ్యాయి. 

అందులో వీరభోగ వ‌సంత‌రాయ‌లు ఇప్పటికే షూటింగ్ మొద‌లై చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సుధీర్ బాబు ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. శ్రీ‌య హీరోయిన్. ఇంద్ర‌సేన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వ‌స్తుంది. ఇక త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో 1971 యుద్ధం నేప‌థ్యంలో సాగే అన‌గ‌న‌గా ద‌క్షిణాదిలో సినిమా చేయ‌నున్నాడు రోహిత్. 2019 జ‌న‌వ‌రిలో షూట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను శ్రీ‌విష్ణుతో క‌లిసి ఆరాన్ మీడియాపై త‌నే నిర్మిస్తున్నాడు రోహిత్. దాంతోపాటే కొత్త ద‌ర్శ‌కుడు ఎస్ డీ చ‌క్ర‌వ‌ర్తితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది అక్టోబ‌ర్ లో షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రాన్ని తానే సొంతంగా నిర్మిస్తున్నాడు రోహిత్. మొత్తానికి పుట్టిన‌రోజు నాడు మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు నారా వార‌బ్బాయి. 

More Related Stories