English   

నారా రోహిత్ చేయికి ఏమైంది..?

Naara rohith

యంగ్ స్టార్ నారా రోహిత్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా అతని చేయి తీసివేశారట. దీంతో ఏమైందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది ఓ సినిమాలో. అంటే ఈ సినిమాలో నారా రోహిత్ ఒక చేయి లేకుండా నటించాన్నమాట. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథే హీరో అంటున్నారు. మరి ఆ కథ ఎవరిదో తెలుసా.. వీరభోగ వసంతరాయలుది. యస్.. వీరభోగ వసంతరాయులు లో నారా రోహిత్ సినిమా అంతా ఒక చేయి లేకుండా నటిస్తున్నాడట. ముందు నుంచీ వైవిధ్యమైన కథలే చేస్తూ వస్తోన్న రోహిత్ ఇలా ఫిజికల్లీ ఎనేబుల్ గా నటించడం ఇదే ఫస్ట్ టైమ్. సినిమాలో అతనికి కుడి చేయి ఉండదంటున్నారు. ఎడమ చేయితోనే సినిమా అంతా కనిపిస్తాడట.. 

ఇక నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు మరో కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే శ్రీయ కూడా ఇంపార్టెంట్ పాత్రలో కనిపిస్తోంది. పూర్తిగా ప్రయోగాత్మక సినిమాగా చెబుతోన్న ఈ మూవీలో శ్రీయ ఫస్ట్ లుక్ ను సాయంత్రం (20.07.18న)విడుదల చేయబోతున్నారు. మరి ఈ లుక్ తో తన పాత్ర సినిమాలో ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది. ఇంద్రసేన అనే దర్శకుడు ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. మరి ఈ కొత్త దర్శకుడు చెప్పబోయే ఈ కొత్త ఎలా ఉంటుందో.. 

More Related Stories