English   

నాగ‌శౌర్య కు మేట‌ర్ లేదా...?

Nartanasala-Teaser
2018-08-08 11:47:21

అంతా అనుకున్న‌ట్టేఅయింది. నాగ‌శౌర్య  విష‌యంలో ముందు నుంచీఏ రూమర్స్ వినిపించాయో.. అవ‌న్నీనిజ‌మే అని తేలిపోయింది. అత‌నికి మేట‌ర్ లేద‌ట‌. ఆ విష‌యాన్ని ఆయ‌న తండ్రే  స్వ‌యంగా కాస్త అనుమానంగా చెప్పాడు.ఎప్పుడు ఎక్క‌డ అంటారా..?  న‌ర్త‌నశాల టీజ‌ర్ లో. య‌స్.. లేటెస్ట్ గా విడుద‌లైన న‌ర్త‌న‌శాల టీజర్ లో టైటిల్ ను జస్టిఫై చేసే విష‌యాలేఉన్నాయి. కుర్రాడు చూడ్డానికి క్లాస్ గాఅప్పుడ‌ప్పుడు మాస్ గా ఉన్నా.. మ‌నోడిలోఅస‌లు మేట‌ర్ లేద‌నేది ఫైన‌ల్ గా తేలిపోయింది. ఈ విష‌యాన్ని హైలెట్ చేస్తూ టీజ‌ర్ వ‌చ్చింది.  టీజ‌ర్ లో ఇంకా చాలా విష‌యాలున్నా.. ఈ గే మేట‌ర్ హైలెట్ అయింది. అఫ్ కోర్స వాళ్లు కూడాఅలా కావాల‌నేప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

నాగ‌శౌర్య సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి  ద‌ర్శ‌కుడు. ఇదే అత‌నికి తొలి సినిమా.  ఛ‌లో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఐరా క్రియేష‌న్స్ లో వ‌స్తోన్న రెండో సినిమాఇది.  క‌శ్మీరా,యామిని భాస్క‌ర్ హీరోయిన్లుగాన‌టిస్తున్నారు. త‌నకు ఛ‌లో తో  మ్యూజికల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన మ‌హ‌తిస్వ‌ర సాగ‌ర్ నే ఈ చిత్రానికీ సంగీత ద‌ర్శ‌కుడు ఎంచుకున్నాడు శౌర్య‌. మొత్తంగా క్లాస్ మాస్ క‌ల‌బోసిన‌ట్టుగా  క‌నిపిస్తోన్న ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది.. ఇక ఈ మ‌ధ్య తండ్రి పాత్ర‌ల్లోన‌వ్వులు పూయిస్తోన్న న‌టుడు శివాజీ రాజా శౌర్య‌కు తండ్రిగా న‌టిస్తున్నాడీ సినిమాలో.  చాలావేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న  న‌ర్త‌న శాల ఆగ‌స్ట్ 30న విడుద‌ల కాబోతోంది.

More Related Stories