English   

నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ..

 Nandamuri Balakrishna
2020-10-20 13:01:25

దాదాపు పదిహేడేళ్ళ క్రితం 2004 సమయంలో స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా చేయాలనుకున్నాడు బాలకృష్ణ. అప్పట్లో చాలా లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు కూడా. 2004 మార్చి 1న అంగరంగ వైభవంగా నర్తనశాల మొదలైంది. కానీ ఆ సినిమా షూటింగ్ మొదలైన 40 రోజులకు అందులో ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో సినిమాను ఆపేశాడు బాలయ్య. ఆ పాత్రలో మరో నటిని ఊహించుకోలేను అంటూ నర్తనశాలకు గుడ్ బై చెప్పేసాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు విడుదల చేస్తున్నాడు బాలయ్య. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు నందమూరి బాలకృష్ణ.

ఇందులో అర్జునుడిగా నటించాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా త్రిపాత్రాభినయం చేశాడు బాలకృష్ణ. ఇందులో భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. అప్పట్లో ఈ సినిమా కోసం 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను చిత్రీకరించాడు బాలకృష్ణ. వాటిని ఇప్పుడు తన ఎన్బికె థియేటర్లో విడుదల చేయబోతున్నాడు. దసరా కానుకగా నర్తనశాల విడుదల కానుంది. శ్రేయస్ ఈటీలో ఈ సినిమా వస్తుంది. దీని ద్వారా వచ్చిన డబ్బులను చారిటీ కోసం ఉపయోగించనున్నాడు బాలకృష్ణ. మొత్తానికి ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ చూసి అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. 

More Related Stories