English   

నేచురల్ స్టార్.. యాక్షన్ ఇమేజ్ కోరుకుంటున్నాడు

nani
2018-03-02 10:51:19

నేచురల్ స్టార్.. ఈ మాటకు ఎంత పవర్ ఉందో.. ఈ మాట వెనక ఎన్ని హిట్స్ ఉన్నాయో తెలుసు. కానీ ఇప్పుడా పదం వద్దనుకుంటున్నాడట నాని. యస్.. నేచురల్ స్టార్ అనే పదానికి పేటెంట్ రైట్స్ ఉన్నాయా అన్నంతగా నానితో ఆ పేరు ముడిపడి ఉంది. కానీ నానికి ఇది నచ్చడం లేదు. తనకూ మాస్ ఇమేజ్ కావాలట.. అందుకే రీసెంట్ గా ఓ మూవీ వదులుకున్నాడనే మాటలు టాలీవుడ్ లో హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి. నాని పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. చూడగానే మనూరి అబ్బాయే అనిపిస్తాడు. తను ఎంచుకునే సబ్జెక్ట్ లే అతనికీ పేరు తెచ్చాయి. కానీ ఇకపై కథలు మార్చాలనుకుంటున్నాడట నాని. ఇన్నాళ్లూ తనకు సాఫ్ట్ ఇమేజ్ తెచ్చిన కథలిక చాలు అనుకుంటున్నాడట. ఎందుకంటే నానికి కూడా యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకుని మాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడట. అందుకోసం ఇకపై తను ఎంచుకునే సబ్జెక్ట్స్ లో ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్.. అంటే మాంచి ఫైట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు తన వద్దకు వచ్చే కథలకూ ఇదే చెబుతున్నాడట. దీంతో అతని ఇమేజ్ ను బేస్ చేసుకుని కథలు తీసుకువెళ్లిన వాళ్లంతా ఖంగు తింటున్నారట.
నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మేర్లపాక గాంధీతో చేసిన సినిమా సమ్మర్ లో విడుదల కాబోతోంది. రీసెంట్ గా నాగార్జునతో చేయబోయే మల్టీస్టారర్ స్టార్ట్ అయింది. ఇందులో నాని కాస్త యాక్షన్ హీరోగానే కనిపిస్తాడని టాక్. అయితే దీనికంటే ముందే అతని వద్దకు నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల ఓ కథ తెచ్చాడు. అది కాస్త సాఫ్ట్ గా ఉండటంతో వద్దన్నాడట. సినిమా టైటిల్ కూడా చిత్రలహరి అని వెరీ క్యాచీగా పెట్టారు. నేచురల్ స్టార్ కదాని అతను కూడా నేచురల్ లవ్ స్టోరీ రాసుకొచ్చాడు. కానీ నాని అందులో యాక్షన్ జోడించమన్నాడు. దీంతో కుదరదనుకుని కిశోర్ అదే సబ్జెక్ట్ తో సాయిధరమ్ తేజ్ తో ఒప్పించాడు. మొత్తంగా నేచురల్ స్టార్ కు యాక్షన్ ఇమేజ్ కావాలని ఎందుకనిపించిందో కానీ.. నాని మాస్ ఇమేజ్ టాక్ మాత్రం టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. 

More Related Stories