English   

జాతి ర‌త్నాలు  కథ అందులోని కామెడీ ఆడియన్స్ ని లీడ్‌ చేస్తుంది..న‌వీన్ పొలిశెట్టి

Naveen Polishetty
2021-03-10 17:48:03

ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ సినిమాతో తెలుగులో సూప‌ర్‌హిట్ సాధించి..చిచోరేలోనూ ఓ కీల‌క పాత్ర పోషించి బాలీవుడ్ అంద‌రి మ‌న‌సుల్నీ గెలుచుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి. ప్ర‌స్తుతం నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం 'జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన‌కి  నాగ్ అశ్విన్ నిర్మాత.  ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో న‌వీన్ పొలిశెట్టి మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

నేను ఎదురు చూసిన క‌థ ఇది

నేను చేసిన ఏంజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచోరే సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. దీంతో నా తర్వాతి సినిమా కూడా ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ తగ్గకుండా ఉండేలా చేయాలని అనుకున్నాను. కొన్నికథలు విన్నాను. కానీ వచ్చినవాటిలో మేజర్‌గా ఇన్విస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ ఉన్నాయి. ఆల్రెడీ ఏంజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయలో చేశాను కదా అనిపించింది. అప్పుడు ఏదైనా ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుకున్నాను. అప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పాడని అనుదీప్‌ ‘జాతిరత్నాలు’ కథను విన్నాను. దర్శకుడు అనుదీప్‌ నరేషన్‌ ఇచ్చినప్పుడే చాలా ఎగై్జట్‌ అయ్యాను. ఈ సినిమా చేయాలని డిసైడై పోయాను. నేను ఎదురు చూసిన క‌థ ఇది. కథ విన్నప్పుడు నేను ఎంత బాగా ఏంజాయ్‌ చేశానో రేపు థియేటర్లో ఆడియన్స్‌ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.

కంప్లీట్‌గా డిఫరెంట్ 

ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమాతో పోల్చి చూసినప్పుడు జాతిరత్నాలు సినిమాలో నేను చేసింది కంప్లీట్‌గా డిఫరెంట్‌. ఇందులో జోగిపేట శ్రీకాంత్‌ పాత్రలో కనిపిస్తాను.  సినిమా చూస్తే… వీళ్ల‌స‌లు స్కూలుకి వెళ్లారా? చ‌దువు సంధ్యా వ‌చ్చా అనుకుంటారు. అమాయ‌కులే. కానీ దుర్మార్గులు. వాళ్ల దుర్మార్గం కూడా ఫ‌న్నీగా ఉంటుంది. ఫ‌న్ మాత్ర‌మే కాదు. చిట్టి – శ్రీ‌కాంత్ ల‌వ్ ట్రాక్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఇందులో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కూడ మంచి క్యారెక్టర్స్‌ చేశారు. . కథ, అందులోని కామెడీ మమ్మల్నీ లీడ్‌ చేస్తుంది.

ప్రతి ఇంట్లో ఓ నవీన్‌ ఉంటాడు. 

నాగీ నాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే తెలుసు. నేను ముంబైలో ఉన్నప్పుడు నా వీడియోలు కొన్ని నాగీకి పంపేవాడిని కూడ. అయితే ఇంత పెద్ద బ్యానర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది.నాగీ,ప్రియ, స్వప్న మా టీమ్‌లో నిజమైన జాతిరత్నాలు. ఇలాంటివారు కొత్తవారికి అవకాశాలు ఇస్తుంటే ప్రతి ఇంట్లో ఓ నవీన్‌ ఉంటాడు. అలాగే ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్‌ వచ్చినా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్‌ అయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత నా సినిమా చూసి  ఆడియన్స్‌ థియేటర్స్ నుంచి నవ్వు కుంటు భయటకు వస్తే అంత కన్నా నాకు పెద్ద పేమంట్‌ ఏమీ ఉండదు. సాధారణంగా గొప్పగొప్పవారిని జాతిరత్నాలు అంటాము. కానీ మా జాతిరత్నాలు సినిమా సెటేరికల్‌ మూవీ.

అవుట్‌పుట్‌ మరింత బాగా వచ్చేలా

సెట్స్‌లో డైరెక్టర్‌ అనుదీప్‌ నాకు ఫ్రీడమ్‌ ఇచ్చాడు. ఒక యాక్టర్‌గా నాకు అలాంటి ఫ్రీడమ్‌ దొరికతే ఇంకా బాగా చేయగలను. సెట్స్‌లో చాలా సీన్స్‌ను ఇంప్రవైజ్‌ చేశాం. ఇవి సినిమా బాగా రావడానికి ఉపయో గపడ్డాయి. సాధారణంగా నాకు ముందు రోజే ప్రిపేర్‌ అయ్యిసెట్స్‌కు వెళ్లడం అలవాటు. ప్రతి షాట్‌ రెండు మూడు సార్లు తీసి..అందులో ఏదీ బాగుంటే అదీ సినిమాలో ఉంటే బాగుంటుందని అనుకుంటాను. కానీ అనుదీప్‌ నేను చేసినా టేక్‌ ఓకే అనేవాడు. దీంతో ఓసారి నేను, నాగీ, అనుదీప్‌ కూర్చొని చర్చించుకుని అవుట్‌పుట్‌ మరింత బాగా వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నాం. అందుకే డైలాగ్స్‌ ముందే రోజే ఇవ్వమని అనుదీప్‌ను అడిగాను.

అతనే ఫస్ట్‌ ఆడియన్

నెల్లూరిలోని ఓ అభిమాని అన్నా ఈ సినిమా 10 సార్లు థియేట‌ర్లో చూద్దాం అనుకున్నా. కానీ ప్రమాదంలో కాలుకి గాయ‌మైంది. న‌డ‌వ‌లేక‌పోతున్నా` అంటూ ట్వీట్ చేస్తే. త‌న‌కోసం సినిమా ప్ర‌త్యేకంగా చూపించాం.అతనే ఫస్ట్‌ ఆడియన్‌. సినిమా చూసి చాలా బాగుందని, హిలేరియస్‌గా ఉందని చెప్పాడు. రేపు ప్రేక్షకులు కూడ ఇదే చెబుతారని ఆశిస్తున్నాం,.ఈ సినిమా ల‌క్ష్యం కూడా అదే. అంద‌రూ త‌మ బాధ‌ల్ని మ‌ర్చిపోవాలి. ఈ సినిమా చూశాక కొంతైనా మ‌ర్చిపోతారు.

రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాను. 

ఒక యాక్టర్‌గా అన్నీ రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. తెలుగులో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాను. త్వరలో ఆయా సినిమాల నిర్మాతలు అనౌన్స్‌ చేస్తారు. అలాగే హిందీలో ఓ సినిమా చేయ బోతున్నా. ఆ సినిమా విదేశాల్లో షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

More Related Stories